Allu Arjun Pushpa : పుష్ప రాజ్‌ను కౌగిట్లో బంధించేసిన స్నేహా రెడ్డి.. అల్లు వారి ప్రేమ.. వైరల్ పిక్

Allu Sneha Reddy Romantic Pic అల్లు స్నేహారెడ్డి తాజాగా ఓ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. అల్లు పరివారమంతా కూడా వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అక్కడ ఇలా రొమాంటిక్‌గా హత్తుకుని కనిపించింది ఈ జంట.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 07:42 AM IST
  • వెకేషన్‌లో అల్లు వారి పరివారం
  • బన్నీని బంధించేసింది స్నేహా రెడ్డి
  • పుష్ప రాజ్‌ లుక్కులో అల్లు అర్జున్
Allu Arjun Pushpa : పుష్ప రాజ్‌ను కౌగిట్లో బంధించేసిన స్నేహా రెడ్డి.. అల్లు వారి ప్రేమ.. వైరల్ పిక్

Allu Sneha Reddy Romantic Pic అల్లు స్నేహారెడ్డి, అల్లు అర్జున్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక బన్నీ అయితే తన సతీమణిని ఎప్పుడూ ఆట పట్టిస్తుంటాడు. నా భార్య ఎంతో అందంగా ఉంది కదూ.. ఈ రోజు సెక్సీగా కనిపిస్తుంది కదూ? అంటూ ఇలా ఫన్నీగా పోస్టులు పెడుతుంటాడు. నిహారిక పెళ్లి కోసం ఫ్లైట్‌లో బయల్దేరినప్పుడు కూడా ఇలానే.. సెక్సీగా ఉందంటూ కామెంట్లు పెట్టాడు. ఇక వాటికి స్నేహారెడ్డి నవ్వుతూ, సిగ్గు పడుతున్నట్టుగా ఎమోజీలను షేర్ చేసింది.

బన్నీ, స్నేహారెడ్డిల క్యూట్ రిలేషన్ తెలియాలంటే ఇన్ స్టాగ్రాంను ఫాలో అవ్వాల్సిందే. అందులో  స్నేహారెడ్డి షేర్ చేసే పోస్టులు చూడాల్సిందే. బన్నీకి సంబంధించిన ఫోటోలు, పర్సనల్ పిక్స్‌ను స్నేహా రెడ్డి ఎక్కువగా వదులుతుంటుంది. ఇక ఎప్పుడైనా వెకేషన్స్‌కు వెళ్తే.. ఈ ఫోటోలను మరింత ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. తాజాగా అల్లు వారంతా కూడా బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇందులో మళ్లీ ఇలా రొమాంటిక్‌గా కనిపించింది ఈ జంట.

బన్నీ ప్రస్తుతం పుష్ప రాజ్ పాత్ర కోసం సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఐదు రోజుల పాటుగా పుష్ప ది రూల్ షూటింగ్ జరిగింది. ఇప్పుడు బన్నీ పూర్తిగా అదే గెటప్పులో ఉండాల్సి వస్తుంది. బన్నీ గుబురు గడ్డం, జుట్టుతో ఉన్నాడు. తాజాగా బన్నీని తన భార్య అల్లు స్నేహా రెడ్డి కౌగిట్లో బంధించేసింది. కౌగిట్లో బంధించేసిన స్నేహారెడ్డి అంతటితో ఊరుకోకుండా ఓ సెల్ఫీ తీసుకుంది. దీంతో బన్నీ వీపు మాత్రమే కనిపించింది. స్నేహా రెడ్డి మాత్రం సెల్ఫీలో అందంగా కనిపించింది.

చూస్తుంటే అల్లు వారంతా కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఇలా బయటకు వెళ్లారేమోననిపిస్తోంది. మొత్తానికి బన్నీ స్నేహారెడ్డిల ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Singer Chinmayi Video : న్యూడ్ ఫోటో లీక్ చేస్తానంటూ బెదిరింపులు.. చిన్మయి వీడియో వైరల్

Also Read : Veerayya Title Song : వీరయ్య.. అదరగొట్టేశావయ్యా.. దుమ్ములేపిసిన చిరు, డీఎస్పీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News