నా పేరు సూర్య యాక్షన్ మేకింగ్ వీడియో

మాస్ హీరోగా అల్లు అర్జున్ స్టామినాని ఎలివేట్ చేసిన నా పేరు సూర్య యాక్షన్ సీక్వెన్సెస్ 

Last Updated : May 9, 2018, 09:08 PM IST
నా పేరు సూర్య యాక్షన్ మేకింగ్ వీడియో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా నా పేరు సూర్య మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా బన్నిని మరింత మాస్ యాంగిల్లో ప్రెజెంట్ చేసింది. ప్రత్యేకించి స్టైలిష్ స్టార్ ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ పవర్‌ఫుల్ మాస్ హీరోగా అతడి స్టామినాని ఎలివేట్ చేశాయి. ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచిన యాక్షన్ సీక్వెన్సెస్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా ఆ చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ ఎనర్జీ చూస్తే, నా పేరు సూర్య కోసం అతడు ఎంత శ్రమించాడో ఇట్టే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. నా పేరు సూర్య యాక్షన్ మేకింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి!

 

అల్లు అర్జున్ సరసన అను ఎమ్మాన్యుయెల్ జంటగా నటించిన ఈ సినిమాలో ఆర్ శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం విశాల్-శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా సక్సెస్ మీట్‌కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న సంగతి తెలిసిందే.  

Trending News