Allu Arjun: 'షారుఖ్ మాస్ అవతార్.. జవాన్': అల్లు అర్జున్

Allu Arjun: షారుఖ్ జవాన్ మూవీపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి, మహేశ్ బాబు, ఆనంద్ మహీంద్రా ఈ మూవీపై పొగడ్తల వర్షం కురిపించగా..తాజాగా ఆ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 03:45 PM IST
Allu Arjun: 'షారుఖ్ మాస్ అవతార్.. జవాన్': అల్లు అర్జున్

Allu Arjun on Jawan Movie: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) జవాన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలుకొడుతోంది. వారం రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసి.. వెయ్యి కోట్లవైపు దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. గురువారం కూడా ఈ మూవీ బుకింగ్స్  ఓ రేంజ్‌లో జరిగాయి. ఇందులో షారుఖ్ నటన, అట్లీ టేకింగ్ ఆడియెన్స్ ను ఫిదా చేసింది. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ మూవీ చూసిన అల్లుఅర్జున్ షారుఖ్ నటనపై ప్రశంసల జల్లు కురిపిచాడు. 

జవాన్ బ్లాక్ బ్లసర్ హిట్ సాధించడం పట్ల చిత్రబృందానికి అల్లుఅర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా జవాన్ పూర్తిగా షారుక్ మాస్ అవతార్ గా కొనియాడారు. మూవీలో షారుక్ స్వాగ్ కు ఫిదా అయినట్లు బన్నీ తెలిపాడు. అంతేకాకుండా విజయ్ సేతుపతి నటనను కూడా ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ ట్వీట్ పై షారుఖ్‌ఖాన్ రిప్లై ఇచ్చాడు. 

అల్లు అర్జున్ అభిమానానికి షారుఖ్ ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా తన స్వాగ్ గురించి ఫైర్ ఏ’ నన్ను పొగడడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. మీ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నాడు. అంతేకాకుండా పుష్ప సినిమాను మూడో రోజుల్లో మూడు సార్లు చూసినట్లు షారుఖ్ తెలిపాడు. మీకు తొందరలోనే హాగ్ ఇస్తానని చెప్పాడు. 

జవాన్ సినిమాలో షారుక్ జోడిగా నయనతార నటించారు. విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. అనిరుధ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఫిదా చేసింది.  ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. 

Also Read: Keerthy Suresh: షారుఖ్ సాంగ్ కు కీర్తి సురేష్ అదిరిపోయే స్టెప్పులు, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News