Allu Arjun Bollywood Debut: షారుఖ్ ఖాన్‌కి నో చెప్పిన అల్లు అర్జున్.. కారణం అదేనా ?

Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్‌డేట్స్‌లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్‌డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. 

Written by - Pavan | Last Updated : Mar 2, 2023, 05:04 AM IST
Allu Arjun Bollywood Debut: షారుఖ్ ఖాన్‌కి నో చెప్పిన అల్లు అర్జున్.. కారణం అదేనా ?

Allu Arjun Bollywood Debut : బాలీవుడ్ బాద్‌షా హీరోగా తెరకెక్కే సినిమాలో ఏ చిన్న పాత్ర వచ్చినా  చేయడానికైనా రెడీ అని అనుకునే హీరోలు ఇండియాలో చాలా మందే ఉంటారు కదా. షారుఖ్ ఖాన్ అంతటి హీరో సినిమాలో నటించే ఛాన్స్ రావడం అంటే అంతకంటే పెద్ద గుర్తింపు ఏం ఉంటుంది అని భావించే స్టార్ హీరోలకు కూడా కొదువే లేదు కదా. అందులోనూ అది అతిథి పాత్ర అంటే చాలామంది హీరోలు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. ఫుల్‌లెంత్ రోల్స్‌తో పోల్చుకుంటే.. అతిథి పాత్రల షూటింగ్ కోసం ఎక్కువ రోజుల పాటు టైమ్ స్పెండ్ చేయకుండా పనికానియొచ్చు. కానీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ సినిమాకి నో చెప్పేశాడట. 

అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్‌డేట్స్‌లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్‌డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అనేక సందర్భాల్లో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీపై టాక్ కూడా నడిచింది. కానీ ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ మాత్రం ఆ మాటను దాటేస్తూ వస్తున్నాడు. 

తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న జవాన్ మూవీలో అతిథి పాత్ర కోసం అల్లు అర్జున్‌ని అప్రోచ్ అయినట్టు తెలిసింది. కోలీవుడ్‌కి చెందిన ఫేమస్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దళపతితో కలిసి మెర్సల్, విజిల్, తెరి (తెలుగులో పోలీసోడు) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు అట్లీ. అట్లీ టాలెంట్ చూసి షారుఖ్ ఖాన్ కూడా అతడికి ఛాన్స్ ఇచ్చాడు. 

అట్లీకి ఇదే మొదటి హిందీ సినిమా కాగా.. షారుఖ్ ఖాన్ సరసన నయన తార ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసమే అల్లు అర్జున్‌ని కాంటాక్ట్ అవగా.. పుష్ప 2 మూవీ షూటింగ్ డేట్స్, జవాన్ మూవీ షూటింగ్ డేట్స్‌తో అడ్జస్ట్ అవడం లేనందున షారుఖ్ ఖాన్ సినిమా చేయలేనని నో చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ డెబ్యూకి ఇంకా టైమ్ ఉందని.. అందుకే షారుఖ్ ఖాన్ సినిమాను అంత సీరియస్‌గా తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి : RRR Actor Ram Charan: రామ్ చరణ్‌ని బ్రాడ్ పిట్‌తో పోల్చిన హోస్ట్.. చరణ్ రియాక్షన్ చూశారా ?

ఇది కూడా చదవండి : Home Loan EMIs: ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News