Pushpa 2:పుష్ప కొత్త షెడ్యూల్.. జాతర ఫైట్ తో మొదలు..

Allu Arjun:ఏప్రిల్‌లో విడుద‌లైన వేర్ ఈజ్ పుష్ప వీడియో పుష్ప సీక్వెల్ పైన మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మొదటి భాగంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప రెండోభాగంతో మరిన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తారని అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా షూటింగ్ గురించి ప్రస్తుతం వచ్చిన ఒక అప్డేట్ వారిని ఖుషి చేస్తోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2023, 05:00 PM IST
Pushpa 2:పుష్ప కొత్త షెడ్యూల్.. జాతర ఫైట్ తో మొదలు..

Pushpa-The Rule:ప్రస్తుతం రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్. ఈ చిత్రం తొలి భాగం పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌లై రూ.300 కోట్ల‌ను వ‌సూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాని కంటే ముఖ్యంగా అల్లు అర్జున్ స్టైల్‌, మేన‌రిజ‌మ్‌ను వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా ఇమిటేట్ చేయ‌టం, వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకి గాని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో అల్లు అర్జున్ అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి కొంచమే అయ్యింది ఇంకా దాదాపు 40% పైగానే పెండింగ్ ఉంది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపు హైదరాబాదులో మొదలుకానుదట.  ఇక ఈ షెడ్యూల్లో పెద్ద జాతర ఫైట్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో అల్లు అర్జున్ తిరుపతి గంగమ్మ జాతరకి సంబంధించిన వేషంలో కనిపించి మెప్పించారు. కాగా ఇప్పుడు జాతర ఫైట్ అనడంతో అల్లు అర్జున్ ఈ ఫైట్ కోసం అదే గెటప్ లో కనిపించొచ్చు అని అంటున్నారు చాలామంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల కోసం ఇటలీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ తిరిగి వస్తారని ఇక పుష్ప షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుందని సమాచారం.

ఈ పుష్ప సెకండ్ పార్ట్ లో సిండికేట్ నాయ‌కుడిగా పుష్పరాజ్‌ ప్ర‌యాణంతో పాటు అత‌డి ఫ్యామిలీ జ‌ర్నీని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆవిష్క‌రించ‌బోతున్నారు. పుష్ప ది రూల్ పేరుతో తెర‌కెక్కున్న ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక మొదటి పార్ట్ క్లైమాక్స్ లో కనిపించిన ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News