Anu Emmanuel : ఈవెంట్‌ ముగిసే టైంకి వచ్చిన అను ఇమాన్యుయేల్.. చురకలు వేసిన అల్లు అరవింద్

Allu Aravind Satires on Anu Emmanuel అల్లు అరవింద్ స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. అను ఇమాన్యుయేల్ తాపీగా వచ్చింది. ఇలా ఆలస్యంగా రావడంపై అల్లు అరవింద్ చురకలు అంటించేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 01:27 PM IST
  • అల్లు శిరీష్‌, అను ఇమాన్యుయేల్ సినిమా
  • ఊర్వశివో రాక్షసివో మూవీ ఈవెంట్
  • వచ్చిన హీరోయిన్‌పై నిర్మాత కౌంటర్
Anu Emmanuel : ఈవెంట్‌ ముగిసే టైంకి వచ్చిన అను ఇమాన్యుయేల్.. చురకలు వేసిన అల్లు అరవింద్

Allu Aravind - Anu Emmanuel : అల్లు శిరీష్ సినిమా వచ్చి ఎన్ని రోజులు అవుతుందో అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో ఎబీసీడీ అనే సినిమాతో సందడి చేశాడు. కానీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. సరైన హిట్ కోసం అల్లు శిరీష్ తన కెరీర్ ఆరంభం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ ఇంత వరకు ఆ విజయాన్ని అల్లు శిరీష్‌ అందుకోలేకపోతోన్నాడు. ఇప్పుడు మళ్లీ అల్లు శిరీష్‌ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కరోనా కంటే ముందుగానే ఈ సినిమాను స్టార్ట్ చేశారు.

అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమా మీద ఎంతటి బజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రూమర్లు వచ్చాయి. ఈ మూవీ కోసం ప్రేమ కాదంటా అనే టైటిల్‌ను ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్‌ను మార్చారు. ఊర్వశివో రాక్షసివో అంటూ టైటిల్ మార్చేశారు.

ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయబోతోన్నారు. అయితే ఈక్రమంలోనే సినిమా ప్రమోషన్స్ పెంచేశారు. నిన్న ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ తన స్టైల్లో స్పీచ్ ఇచ్చాడు. కొడుకు శిరీష్‌ కోసం అల్లు అరవింద్ ముందుకు వచ్చాడు. ఇలాంటి ఈవెంట్లలో హీరోయిన్లు ముందుగానే వస్తుంటారు. కానీ ఇక్కడ అను ఇమాన్యుయేల్ మాత్రం ఎంతో తాపీగా.. ఈవెంట్ ముగిసే టైంకు వచ్చింది. అలా వస్తున్న అను ఇమాన్యుయేల్ మీద సెటైర్లు వేశాడు అల్లు అరవింద్.

స్టేజ్ మీద అల్లు అరవింద్ మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో అను ఇమాన్యుయేల్ వచ్చింది. తన ప్రసంగాన్ని ఆపిన అల్లు అరవింద్.. రా రా.. ఈవెంట్ ఎలాగో ముగించేస్తున్నాం..ఇప్పుడైనా వచ్చావ్..మంచిది అన్నట్టుగా కౌంటర్లు వేశాడు. మొత్తానికి అను ఇమాన్యుయేల్ మాత్రం తన సినిమా ఈవెంట్‌ను, సినిమానులైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అను ఇమాన్యుయేల్‌కు ఈ సినిమా అయినా కలిసి వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read :  Ginna Day 1 Collections : తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణం.. 'ఓరి దేవుడా' అనుకునేలా 'జిన్నా'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే

Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News