Alia Bhatt Telugu Song: తెలుగు పాట పాడిన ఆలియా భట్‌.. నాగార్జున, ఎన్టీఆర్ ఫిదా!

Brahmastra Actress Alia Bhatt Sings Kumkumale Song in Telugu. బ్ర‌హ్మ‌స్త్ర‌ ప్రేస్‌ మీట్‌లో హీరోయిన్ ఆలియా భట్ తన గొంతు సవరించారు. తెలుగు పాట పాడి అందరిని అశ్చర్యానికి గురి చేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 3, 2022, 04:44 PM IST
  • తెలుగు పాట పాడిన ఆలియా భట్‌
  • నాగార్జున, ఎన్టీఆర్ ఫిదా
  • సెప్టెంబ‌ర్ 9న బ్ర‌హ్మ‌స్త్ర‌ విడుదల
Alia Bhatt Telugu Song: తెలుగు పాట పాడిన ఆలియా భట్‌.. నాగార్జున, ఎన్టీఆర్ ఫిదా!

Alia Bhatt Singing Kesariya Song in Telugu at Brahmastra Movie Press Meet: బాలీవుడ్ స్టార్స్ ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ జంటగా నటించిన సినిమా 'బ్ర‌హ్మ‌స్త్ర‌'. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా తెర‌కెక్కిన బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుండగా.. మొదటి భాగం ‘శివ’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున‌, మౌనీ రాయ్ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులో ఈ సినిమాను ఎస్ ఎస్ రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్నారు. బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుదల కానుంది. 

బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హిందీతో పాటు తెలుగులో కూడా జోరుగా ప్ర‌మోష‌న్‌లు జరుపుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజ‌మౌళి ప్లాన్ చేయగా.. చివ‌రి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. తెలంగాణ పోలీస్‌ల నుంచి ప‌ర్మీష‌న్ రాక‌పోవ‌డంతో.. శుక్రవారం బ్ర‌హ్మ‌స్త్ర‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగలేదు. దాంతో చిత్ర యూనిట్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ప్రెస్ మీట్‌ నిర్వ‌హించింది. 

బ్ర‌హ్మ‌స్త్ర‌ ప్రెస్‌ మీట్‌కు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ ప్రేస్‌ మీట్‌లో హీరోయిన్ ఆలియా భట్ తన గొంతు సవరించారు. తెలుగు పాట పాడి అందరిని అశ్చర్యానికి గురి చేశారు. బ్రహ్మాస్త్ర సినిమాలోని 'కేసరియా' పాటను తెలుగులో అద్భుతంగా ఆలపించారు. ఆలియా లైవ్‌లో తెలుగు పాట పాడుతుండగా.. భర్త రణ్‌బీర్‌ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. కరణ్‌ జోహార్, నాగార్జున, ఎన్టీఆర్, రాజమౌళి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: SRH Coach: కావ్యా మారన్ సంచనలన నిర్ణయం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలక మార్పు!

Alos Read: Mohammad Hafeez BCCI: బీసీసీఐకి సాటి మరేదీ లేదు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ ప్రశంసల వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News