RRR movie: రాజమౌళికి ఆలియా భట్ స్పెషల్ రిక్వెస్ట్

Alia Bhatt's special request to SS Rajamouli: ఎస్.ఎస్. రాజమౌలి డైరెక్ట్ చేస్తున్న RRR (రౌద్రం రుధిరం రణం) సినిమాలో కొమరం భీమ్‌గా జూ. ఎన్టీఆర్ ( Jr Ntr ), అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్ ( Ramcharan ) కనిపించనుండగా, రాంచరణ్ సరసన ఆలియా భట్ సీత పాత్ర పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.

Last Updated : Sep 22, 2020, 07:52 PM IST
RRR movie: రాజమౌళికి ఆలియా భట్ స్పెషల్ రిక్వెస్ట్

Alia Bhatt's special request to SS Rajamouli: ఎస్.ఎస్. రాజమౌలి డైరెక్ట్ చేస్తున్న RRR (రౌద్రం రుధిరం రణం) సినిమాలో కొమరం భీమ్‌గా జూ. ఎన్టీఆర్ ( Jr Ntr ), అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్ ( Ramcharan ) కనిపించనుండగా, ఆలియా భట్ మరో ప్రధాన పాత్ర పోషిస్తోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఆలియా భట్ ఇంకా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొనలేదు. 

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమవుతున్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇంకా తిరిగి ప్రారంభం కాలేదు. నవంబర్ నుండి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఒక టాక్ వినిపిస్తోంది. Also read : Sarkaru Vaari Paata actress: సర్కార్ వారి పాట నుంచి కీర్తి సురేష్ ఔట్ నిజమేనా ?

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆలియా భట్ ( Actress Alia bhatt ) నవంబర్, డిసెంబర్ షెడ్యూల్ని ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కేటాయించనుందట. అలాగే ఈ రెండు నెలల్లో ఆలియా భట్ తన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని ముగించమని రాజమౌళికి స్పెషల్ రిక్వెస్ట్ చేసిందట.

ఒకవేళ ఆలియా భట్ రిక్వెస్ట్‌కి రాజమౌళి ఓకే చెబితే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ( RRR movie shooting ) ప్రారంభించగానే, మొదటగా ఆలియా భట్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. కానీ దర్శక దిగ్గజం రాజమౌళి ( SS Rajamouli ) తరువాత షూటింగ్ షెడ్యూల్‌ని ఎలా ప్లాన్ చేయనున్నారో చూడాలి మరి. Also read : Rhea Chakraborty: నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు

Trending News