Samantha, Naga Chaitanya separation: ఒక సినిమా.. ప్రేమ.. పెళ్లి.. అంతలోనే విడాకులు.. కథలా చై-స్యామ్ బంధం

Samantha, Naga Chaitanya announce separation- Give us privacy to move on : టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాను సమంత భార్యభర్తలుగా విడిపోతున్నామని నాగ చైతన్య ట్వీట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 07:10 PM IST
  • అక్కినేని నాగ చైతన్య, సమంతలపై వస్తున్న రుమార్స్ నిజమయ్యాయి
  • విడిపోయిన సమంత-నాగ చైతన్య
  • భార్యభర్తలుగా విడిపోతున్నామని చెప్పిన చైతూ, స్యామ్
  • స్నేహితులుగా కలిసి ఉంటామని చెప్పిన సమంత-నాగ చైతన్య
Samantha, Naga Chaitanya separation: ఒక సినిమా.. ప్రేమ.. పెళ్లి.. అంతలోనే విడాకులు.. కథలా చై-స్యామ్ బంధం

Samantha and Naga Chaitanya ‘part ways as husband and wife’: ‘Our friendship will always hold a special bond between us’: గత కొన్ని రోజులుగా అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంతలపై (Samantha) వస్తున్న రుమార్స్ ఇప్పుడు నిజమయ్యాయి. అభిమానులందరికీ చేదువార్త ఇది. టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాను సమంత భార్యభర్తలుగా విడిపోతున్నామని నాగ చైతన్య ట్వీట్ చేశారు. పదేళ్లుగా తమ మధ్య స్నేహబంధం కొనసాగిందన్నారు చైతు. తమ మధ్య రిలేషన్‌లో (Relationship) అదే చాలా కీలకం అన్నారు.. ఆ ప్రత్యేక బంధం ఇకనుంచి కూడా కొనసాగుతుందని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు నాగ చైతన్య. తాము ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ట్వీట్ (tweet) చేశారు.

సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు నాగ చైతన్య స్పష్టం చేశారు. ఎంతో ఆలోచించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నాగ చైతన్య. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ కోరాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ (instagram) ద్వారా ప్రకటించింది. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

 

వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం

మొత్తానికి గత కొన్ని రోజులుగా నాగచైతన్య‌‌-సమంతలపై వినిపించిన వార్తలే చివరికి నిజమయ్యాయి. చైతూ – స్యామ్‌ విడాకుల విషయం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో (telugu states) చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు చాలా కాలంగానే సోషల్ మీడియాలో (social media) ప్రచారం సాగుతోంది. కానీ సమంత కొన్ని రోజుల క్రితం ఈ వార్తలను కొట్టి పారేసింది. అవన్నీ రూమర్స్.. వాటిని పట్టించుకోకండి అని చెప్పింది.

అక్కినేని ఇంటి పేరు తొలగింపు

అయితే ఒక మోడల్‌తో (model) చనువుగా ఫోటోను కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో సమంత షేర్ చేసింది. తర్వాత ఆ ఫోటోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది సమంత. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో వేదికల్లో సమంత (Samantha) తన పేరు వెనుక అక్కినేని (akkineni) సర్ నేమ్‌ను తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

 

వివాహ బంధం బీటలువారింది

అప్పటి నుంచే సమంత‌‌, చైతన్యల దాంపత్య జీవిత అంశం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది. వారిద్దరూ ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే ప్రచారం సాగుతూనే ఉంది. సమంత, నాగ చైతన్యల(Naga Chaitanya) మధ్య వివాహ బంధం బీటలువారిందన్న సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

 

నాగార్జున బర్త్ డే వేడుకలకు దూరం..

అంతేకాదు తాజాగా చైతూ లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి సమంత గోవా ట్రిప్‌కు వెళ్లడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలకు మరింత ఊతమిచ్చింది. అలాగే అక్కినేని నాగార్జున (akkineni nagarjuna) బర్త్ డే వేడుకలకు కూడా సమంత హాజరుకాకపోవడం.. లవ్‌స్టోరీ మూవీకి సంబంధించి ఇంట్లో చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్న వేడుకకు రాకపోవడంతో ఈ వార్త మరింత బలపడింది. దీనిపై సమంత, చైతూ లేదా నాగార్జున (nagarjuna) ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు. అంతేకాదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిస్ట్రిక్షన్‌లో ఉండటం తనకు ఇష్టముండదని సమంత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపాయి. 

2017లో పెళ్లి

నాగ చైతన్య, సమంతల మధ్య దాదాపు పదేళ్లకుపైగానే బంధం ఉంది. వీరిద్దరూ ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 7కు వీరిద్దరి మధ్య వివాహ బంధానికి (Marriage) నాలుగేళ్లు పూర్తవుతాయి. గోవాలో క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

 

బోల్డ్ రోల్స్ చేయడమే వివాదానికి కారణమా?

పెళ్లి తర్వాత కూడా సమంతకు (Samantha) క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది సమంత. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ చెడిందన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా పెళ్లి తర్వాత కూడా సమంత బోల్డ్ రోల్స్ (bold roles) చేయడమే వివాదానికి కారణమని తెలుస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

 

వెబ్ సిరీస్‌‌లలో సమంత బోల్డ్ రోల్స్ చేయడంతో..

అక్కినేని కుటుంబం (akkineni family) అలాంటి పాత్రలు చేయొద్దని చెప్పినా సమంత వారి మాటను లెక్కచేయకపోవడంతోనే విడాకులకు దారి తీసిందని తెలుస్తోంది. తన లైఫ్, తన ఇష్టమన్నట్లు సమంత ధోరణి ఉండటంతోనే ఇష్యూ పెద్దదై చివరకు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్‌ 2‌తో పాటు వెబ్ సిరీస్‌‌లలోనూ సమంత బోల్డ్ రోల్స్ చేయడంపై అక్కినేని కుటుంబీకులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ సమంతకు (Samantha) నచ్చకపోవడం.. తనకు నచ్చిన స్టైల్‌లో తాను ముందుకెళ్లడంతోనే చివరకు నాగ చైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని టాక్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News