Adivi Sesh Supriya Dating : అడివి శేష్‌-సుప్రియ డేటింగ్‌?.. దూరంగా నాగ చైతన్య.. ఆ పిక్‌తో సీక్రెట్ రివీల్

Adivi Sesh Supriya Dating సుప్రియ, అడివి శేష్‌లు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డేటింగ్ వార్తలకు బలం చేకూర్చేలా ఓ ఫోటో బయటకు వచ్చింది. అక్కినేని వారి క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో అడివి శేష్ కనిపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 03:25 PM IST
  • అక్కినేని ఇంట్లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్
  • దూరంగా ఉన్న నాగ చైతన్య
  • సుప్రియ అడివి శేష్ డేటింగ్ రూమర్లపై క్లారిటీ
Adivi Sesh Supriya Dating : అడివి శేష్‌-సుప్రియ డేటింగ్‌?.. దూరంగా నాగ చైతన్య.. ఆ పిక్‌తో సీక్రెట్ రివీల్

Adivi Sesh Supriya Dating అడివి శేష్‌ సుప్రియ కలిసి గూఢచారి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సుప్రియ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. సుప్రియ ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటుంది. ఆమె పెళ్లి, విడాకుల వ్యవహారాలు అందరికీ తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా అడివి శేష్ సుప్రియ బంధం మీద ఏవేవో రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా వాటికి బలం చేకూర్చేలా ఓ ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అక్కినేని వారి క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన ఫోటోను సుశాంత్ షేర్ చేశాడు. ఇందులో సుమంత్, సుశాంత్, సుప్రియ ఇలా అక్కినేని పరివారమంతా కనిపించారు. ఈ అందరిలో అడివి శేష్ మాత్రమే బయటి వ్యక్తి. అయితే అడివి శేష్, సుప్రియలు పక్కపక్కనే కూర్చున్నారు. ఇక వీరిద్దరి డేటింగ్ మ్యాటర్ ఈ పిక్‌తో అందరికీ స్పష్టమైనట్టుంది.

గూఢచారి సినిమా నుంచి కూడా ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందనే టాక్స్ వచ్చాయి. మరి ఇప్పటికైనా ఈ ఇద్దరూ తమ తమ బంధం మీద రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే.. ఈ ఫోటోలో మాత్రం నాగ చైతన్య కనిపించడం లేదు. అసలే ఇప్పుడు నాగ చైతన్య కాస్త లో ఫేజ్‌లో ఉన్నాడు.

నటించిన సినిమాలు ఆడటం లేదు.. పర్సనల్ లైఫ్ కూడా అంత బాగా ఏమీ లేదు.. సమంతతో విడిపోయాడు.. శోభితా ధూళిపాల్లతో ప్రేమలో ఉన్నట్టుగా లీకులు వస్తూ ఉంటాయి. కానీ వీటిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం నాగ చైతన్య ఇవ్వడం లేదు. అక్కినేని వారింట్లో సుమంత్, సుప్రియ, సుశాంత్ ఇలా అందరూ సింగిల్‌గానే ఉన్నారు.

అడివి శేష్‌ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ గూఢచారి సినిమాను చేసిన అడివి శేష్.. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తుండటంతో ఈ డేటింగ్ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

Also Read : Mouni Roy Pics : మౌనీ రాయ్.. కొంప ముంచేసేలా ఉందోయ్.. ఎగసిపడుతున్న ఎద అందాలు

Also Read : AM Ratnam Kushi : ఖుషి సినిమాలోని ఆ ఆలోచనలన్నీ పవన్ కళ్యాణ్‌వే.. ముందు ఆ టైటిల్ అనుకున్నాం.. ఏఎం రత్నం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News