Adipurush Box Office Collections 2023: ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా కలెక్షన్లు రోజురోజూకు పడిపోతున్నాయి. 11వరోజూ మరింత దిగజారాయి. రెండు కోట్లు తక్కువ వసూళ్లు సాధించినట్లు రిపోర్టులు అంచనా వేశాయి. తొలి మూడు రోజుల బాక్సాపీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టించింది ఆదిపురుష్. నాలుగో రోజు నుంచి దీని వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. రోజూకు పది కోట్లు కూడా రావడం లేదు. నెగిటివ్ టాక్ రావడం, వివాదాలు, కోర్టులో కేసులు తదితర కారణాల వల్ల ఈ సినిమా వసూళ్లు తగ్గడానికి కారణం. మరోవైపు సినిమాలో రామ, రావణ పాత్రలు చూపించే విధానం సరిగ్గా లేకపోవడం, హనుమాన్ డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఈ మూవీ కలెక్షన్లు పడిపోయాయి. మెుదటి వారం సుమారు రూ. 260 కోట్లు సాధించింది ఈ చిత్రం.
11 రోజుల కలెక్షన్స్ లిస్ట్:
శుక్రవారం: రూ. 86.75 కోట్లు
శనివారం: రూ.65.25 కోట్లు
ఆదివారం: రూ. 69.1 కోట్లు
సోమవారం: రూ. 16 కోట్లు
మంగళవారం: రూ. 10.7 కోట్లు
బుధవారం: రూ. 7.25 కోట్లు
గురువారం: రూ. 4.85 కోట్లు
1వ వారం: రూ. 259.9 కోట్లు
శుక్రవారం: రూ. 3.4 కోట్లు
శనివారం: రూ. 5.25 కోట్లు
ఆదివారం: రూ. 7.2 కోట్లు
సోమవారం: రూ. 1.75 కోట్లు (తొలి అంచనాలు)
మొత్తం: రూ. 277.50 కోట్లు
సెప్టెంబర్ 28న సలార్.. సంక్రాంతికి ప్రాజెక్టు-కే!
మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఈ చిత్రం సెప్టెంబరులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు-కే సినిమా షూటింగ్ లో బిజి బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనే తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
Also Read: Project K Update: రెండు పార్టులుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook