Adipurush 10 Days Collections: దారుణంగా పడిపోయిన 'ఆదిపురుష్' కలెక్షన్స్.. 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

Adipurush 10 Days Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మెుత్తం పది రోజుల వసూళ్లు గురించి తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 02:14 PM IST
Adipurush 10 Days Collections: దారుణంగా పడిపోయిన 'ఆదిపురుష్' కలెక్షన్స్.. 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

Adipurush 10 Days Box Office Collections and Details: ప్రభాస్, కృతి సనన్‌లు జంటగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఆధునిక రామాయణంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నాలుగో రోజు నుండి ఈ మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. రోజూకు పది కోట్లు కూడా కలెక్షన్లు రావడం లేదు. ఇప్పటికే సినిమా విడుదలై పది రోజులైంది. నిన్న అంటే సోమవారం సుమారు ఆరు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఈరోజు ఆరు కోట్లు రాబడుతుందని తెలుస్తోంది. 

పది రోజుల కలెక్షన్స్ లిస్ట్: 
శుక్రవారం: రూ. 86.75 కోట్లు
శనివారం: రూ. 65.25 కోట్లు
ఆదివారం: రూ 69.1 కోట్లు
సోమవారం: రూ. 16 కోట్లు
మంగళవారం: రూ. 10.7 కోట్లు
బుధవారం: రూ. 7.25 కోట్లు
గురువారం: రూ. 4.85 కోట్లు
రెండవ శుక్రవారం: రూ. 3.13 కోట్లు
రెండో శనివారం: రూ. 5.63 కోట్లు
రెండవ ఆదివారం: రూ. 6.00 కోట్లు (తొలి అంచనాలు)
మొత్తం: రూ. 274.16 కోట్లు

Also Read: Project-K Cast: ప్రభాస్ మూవీలో కమల్ హాసన్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్..!

ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ ఆడియెన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచాయి. శ్రీరాముడు, రావణుడు మరియు హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై విమర్శలు తలెత్తాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివిటీ కారణంగా గత ఏడు రోజులగా కలెక్షన్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు గ్రాస్ రాబట్టిందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ టి-సిరీస్ ప్రకటించింది. వరల్డ్ వైడ్ గా జూన్ 16న  విడుదలైంది ఆదిపురుష్. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరెక్కించారు. 

సెప్టెంబర్ 28 రానున్న సలార్!
మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే  ప్రశాంత్ నీల్-ప్రభాస్ మూవీ సలార్ షూటింగ్ దాదాపు పూర్తయింది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ నిరాశ పరచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. 

Also Read: Mahesh Babu New Car: కొత్త కారు కొన్న మహేశ్ బాబు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News