Tamannaah: హాస్పిటల్ నుంచి తమన్నా డిశ్చార్జ్

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి తమన్నా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.

Last Updated : Oct 6, 2020, 05:09 PM IST
Tamannaah: హాస్పిటల్ నుంచి తమన్నా డిశ్చార్జ్

Actress Tamannaah discharged from hospital: టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి తమన్నా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా ట్విట్టర్ వేదిక ద్వారా ఓ ప్రకటనను విడుదలచేసి అభిమానులతో పంచుకుంది. షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అందరం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. అయినప్పటికీ గతవారం తనకు తేలికపాటి జ్వరం వస్తే.. పరీక్ష చేయించుకోగా.. కరోనా (Coronavirus) పాజిటివ్‌‌గా వచ్చిందని తెమన్నా వెల్లడించింది. 

పాజిటివ్‌గా తేలడంతో  వైద్యుల సూచన మేరకు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందానని తమన్నా తెలిపింది. ప్రస్తుతం తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని.. హోం క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొంది. ప్రపంచంలోని చాలా మంది కరోనాతో ఇబ్బంది పడుతుండగా.. తాను పూర్తిగా కోలుకోవడం అదృష్టమేనని.. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు అంటూ ట్విట్ చేసింది మిల్కీ బ్యూటీ. ఇదిలాఉంటే.. కొన్ని రోజుల కిందట తమన్నా తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. కొందరు సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలగా.. తమన్నాకు మాత్రం అప్పుడు నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.  Also read: Sushant Singh Rajput: రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

కాగా.. ప్రస్తుతం తమన్నా గోపీచంద్‌తో కలిసి 'సీటీమార్‌' చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, మరో హిందీ సినిమా ప్రాజెక్టును కూడా ఒప్పుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. Also read: Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్

Trending News