Anchor Suma: సుమ బంగారుతల్లి.. ఎవరికీ తెలియని గొప్పవిషయం బయటపెట్టిన సీనియర్ నటి

Subhashini reveals greatness of suma: క్యాష్ తాజా ప్రోమోలో సుమ తనకు చేసిన సాయం గురించి సీనియర్ నటి సుభాషిణి ఎమోషనల్ అయింది. ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం సుమనే అని ఆమె కామెంట్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 11:58 AM IST
  • క్యాష్ లో సందడి చేసిన సీనియర్ నటీనటులు
  • సుమ గొప్పతనం బయటపెట్టిన సుభాషిణి
  • ఎమోషనల్ అయిన సుమ
Anchor Suma: సుమ బంగారుతల్లి.. ఎవరికీ తెలియని గొప్పవిషయం బయటపెట్టిన సీనియర్ నటి

Actress Subhashini reveals greatness of suma: ఎక్కడో మలయాళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన సుమ తెలుగు నటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని యాంకర్ గా సెటిలైపోయింది. ఈ రోజు తెలుగులో ఏదైనా ప్రోగ్రాం చేయాలన్నా ఒక ఈవెంట్ హోస్ట్ చేయాలన్నా నిర్వాహకులకు ముందుగా గుర్తొచ్చేది సుమా పేరే అంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి విరిగిన తెలుగు వారి కంటే సుమ చాలా అద్భుతంగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ముందు వరుసలో దూసుకుపోతోంది. అయితే ఎప్పుడూ సుమను చలాకీగా కౌంటర్లు వేసే మహిళగా అందరూ భావిస్తూ వచ్చారు. 
 
కానీ ఆమెలో కూడా ఒక మంచి మనసు దాగి ఉందనే విషయాన్ని తాజాగా ఒక సీనియర్ నటీమణి వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే యాంకర్ సుమ ప్రస్తుతం క్యాష్ అనే ఒక ప్రోగ్రాం పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ షో కి మంచి టిఆర్పి రేటింగ్ రావడంతో నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త గెస్ట్ లతో ఈ షో నిర్వహించేందుకు ప్లాన్లు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమో సుమో గొప్పతనాన్ని బయటపెట్టినట్లయింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమో ప్రకారం ఈ ఎపిసోడ్ కి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, సుభాషిణి, బాలాజీ, జెన్నీ వంటి వారు హాజరయ్యారు.

అవడానికి సీనియర్ ఆర్టిస్టులే కానీ ఎక్కడా తగ్గకుండా తమదైన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సుభాషిణి తనకు సుమ ఎలా అండగా నిలబడింది అనే విషయాన్ని బయట పెట్టింది. గత కొంత కాలం క్రితం అల్లరి సుభాషిణి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వచ్చాయి. తరువాత సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కొంత సాయం అందించారు. తరువాత ఆమె కోలుకున్నారు కూడా అయితే తాను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి ముఖ్య కారణం సుమ అని సుభాషిణి తాజా క్యాష్ ఎపిసోడ్లో వెల్లడించింది. తనకు ఆరోగ్యం బాగోకపోతే వైద్యానికి సుమ సాయం చేసిందని సుభాషిణి చెప్పుకొచ్చారు. అంతేకాక అప్పుడు సాయం చేసి వదిలేయడమే కాక ఇప్పటికీ ఆరు నెలలకి ఒకసారి తన వైద్యానికి సంబంధించిన మందులు పంపిస్తూ ఉంటుందని సుభాషిణి చెప్పుకొచ్చారు.

అయితే ఆమె ఈ విషయాన్ని ఇలా బయటపెడుతుందని ఊహించని సుమా ఒక్కసారిగా షాక్ అయినా వెళ్లి ఆప్యాయంగా ఆమెను కౌగిలించుకున్నారు. సుభాషిని అలా అంటుంటే సుమ కూడా ఎమోషనల్ అవుతూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సుభాషిణి మాట్లాడుతూ మరో జన్మ అనేది ఉంటే గనుక నువ్వు నాకడుపునే పుట్టాలని ఉందమ్మా అంటూ సుభాషిణి కూడా ఎమోషనల్ అయింది. కాస్త కామెడీ, మరికొంత ఎమోషనల్ గా సాగిపోయిన ఈ ఎపిసోడ్ జూలై 16వ తేదీన ప్రసారం అయ్యే అవకాశం ఉంది. మరి పూర్తి ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Ram Charan: బాలీవుడ్ పై కన్నేసిన రామ్ చరణ్.. ముంబైలో బంగ్లా కొనుగోలు.. ఈసారి తగ్గేదేలే అంటూ!

Also Read: Kushboo Sundar:జబర్దస్త్ కొత్త జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చిన కుష్బూ.. గుడి కట్టలేదా అంటూ ఒక ఆట ఆడేసింది!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News