Secret Affair: ప్రముఖ డైరెక్టర్‌తో సీక్రెట్ ఎఫైర్... ప్రెగ్నెన్సీ కూడా... బాంబు పేల్చిన నటి మందనా కరిమి...

Bollywood Actress Secret Affair: హిందీ రియాలిటీ షో 'లాకప్'లో ప్రముఖ నటి, మోడల్ మందనా కరిమి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఓ ప్రముఖ డైరెక్టర్‌తో సాగించిన సీక్రెట్ ఎఫైర్‌ను బయటపెట్టింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 06:35 PM IST
  • షాకింగ్ విషయం బయటపెట్టిన నటి మందనా కరిమి
  • ప్రముఖ డైరెక్టర్‌తో నటి సీక్రెట్ రిలేషన్
  • గర్భం కూడా దాల్చినట్లు వెల్లడి
Secret Affair: ప్రముఖ డైరెక్టర్‌తో సీక్రెట్ ఎఫైర్... ప్రెగ్నెన్సీ కూడా... బాంబు పేల్చిన నటి మందనా కరిమి...

Bollywood Actress Secret Affair: హిందీ రియాలిటీ షో 'లాకప్'లో ప్రముఖ నటి, మోడల్ మందనా కరిమి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు 'సీక్రెట్ రివీల్' ఆప్షన్ ఎంచుకున్న మందనా... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలను బయటపెట్టింది. ఈ క్రమంలో మందనా కరిమి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా... హోస్ట్ కంగనా రనౌత్ సైతం కంటతడి పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన లాకప్ షో ప్రోమో ద్వారా మందనా కరిమి వెల్లడించిన సీక్రెట్ బయటకొచ్చింది.

'లాకప్' షోలో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. గతంలో తన భర్తతో విడాకులు తీసుకున్న సందర్భంలో ఓ ప్రముఖ దర్శకుడితో సీక్రెట్ ఎఫైర్ కొనసాగించినట్లు మందనా కరిమి షాకింగ్ విషయం వెల్లడించింది. ఓవైపు విడాకులు... మరోవైపు సీక్రెట్ ఎఫైర్... ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. సదరు దర్శకుడు మహిళా హక్కుల గురించి మాట్లాడుతాడని... అతను చాలామందికి ఒక స్పూర్తి అని పేర్కొంది. 

తాను, ఆ దర్శకుడు కలిసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నామని... కానీ అది జరిగే సమయానికి... అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. అయితే అక్కడికే 'లాకప్ షో' ప్రోమో ముగియడంతో మందనా కరిమి ఇంకా ఏం చెప్పిందనేది తెలియలేదు. ఈ రాత్రి 10.30 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌తో మందనా కరిమి సీక్రెట్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. 

కాగా, మందనా కరిమి 2017లో గౌరవ్ గుప్తా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత 5 నెలలకే అతనితో విడిపోయారు. అతనిపై గృహ హింస చట్టం కింద మందనా కేసు కూడా పెట్టింది. 2021లో విడాకులు తీసుకుని ఈ ఇద్దరు అధికారికంగా విడిపోయారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గౌరవ్ ఇతర మహిళలతో సంబంధాల కోసం వెంపర్లాడేవాడని ఇటీవల ఇదే లాకప్ షోలో మందనా కరిమి వెల్లడించింది. ఆ క్రమంలో గౌరవ్ తన పట్ల శాడిస్ట్‌లా ప్రవర్తించి చిత్రహింసలకు గురిచేశాడని చెప్పింది. అంతేకాదు, గౌరవ్‌తో విడిపోయిన ఈ నాలుగేళ్లలో తనకు తెలిసిన చాలామందితో అతను శారీరక సంబంధం పెట్టుకున్నట్లు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని బాంబు పేల్చింది. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ALTBalaji (@altbalaji)

Also Read: AP Cabinet 2.0: ఏపీ కొత్త కేబినెట్.. 25 మందితో జాబితా రెడీ... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Also Read: Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' పోస్ట‌ర్‌ వచ్చేసింది.. పవన్‌ కళ్యాణ్ న్యూ లుక్‌ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News