మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్‌.. కారణం ఏంటో తెలుసా?

Keerthy Suresh rejects Mani Ratnam's movie. పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించడానికి కీర్తి సురేశ్‌ ను చిత్ర బృదం సంప్రదించగా.. డేట్స్‌ లేవని చెప్పేశారట.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 11, 2022, 02:08 PM IST
  • మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్‌
  • కారణం ఏంటో తెలుసా?
  • కీర్తి పాత్రలో చెన్నై చిన్నది
మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్‌.. కారణం ఏంటో తెలుసా?

Keerthy Suresh rejects Mani Ratnams Ponniyin Selvan Movie due to Shooting: స్టార్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి, నాయకుడు, బొంబాయి, రోజా, గీతాంజలి, గురు లాంటి ఆల్ టైం ఫేవరేట్ సినిమాలను తెరకెక్కించారు. మణిరత్నం సినిమాలో నటించాలని ప్రతిఒక్క హీరో లేదా హీరోయిన్ కలలు కంటారు. చిన్న రోల్‌ ఇచ్చినా చాలని ఎంతోమంది ఆరాటపడుతుంటారు. అలాంటి స్టార్‌ డైరెక్టర్‌ చాన్స్‌ ఇస్తే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది 'మహానటి' కీర్తి సురేశ్‌.. మణిరత్నం సినిమా ఆఫర్‌ను తిరస్కరించారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం మళ్లీ పెద్ద ప్రయోగం చేస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాలో అత్యంత భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమా పార్ట్ 1ని గత ఏడాదే రిలీజ్ చేయాలని మణిరత్నం ప్లాన్ చేసినా.. కరోనా కారణంగా అందరి డేట్స్ తారుమారవడం, ఇతర కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. 

పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్, విక్రమ్, సూర్య, కార్తి, త్రిష, జయం రవి లాంటి అగ్ర తారలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించడానికి కీర్తి సురేశ్‌ ను చిత్ర బృదం సంప్రదించగా.. డేట్స్‌ లేవని చెప్పేశారట. తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు వచ్చింది. ఇక విషయం తెలిసిన కీర్తి ఫ్యాన్స్‌ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. మణిరత్నం వంటి స్డార్‌ డైరెక్టర్‌ చిత్రంలో అవకాశం వస్తే వదులుకుందా? అని ఒకరు కామెంట్ చేయగా.. ఇంకోసారి అవకాశం వస్తుందా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా పెద్దన్న సినిమాలో నటిస్తుండటంతో పాటు మహేష్ బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగానే కీర్తి సురేశ్‌.. మణిరత్నం సినిమా ఆఫర్‌ను వదులుకున్నారట. రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్‌ వస్తుందని భావించిన కీర్తి.. డేట్స్‌ సర్దుబాటు కావడం లేదని చెప్పిందని సినీ వర్గాల టాక్. చివరకు కీర్తి పాత్రలో చెన్నై చిన్నది త్రిష వచ్చి చేరారు. త్రిష కుందనవై అనే రోల్‌ పోషించారు. 

Also Read: Lucky Zodiacs: ఈ 3 రాశులవారు పుట్టుకతోనే అదృష్టవంతులు, వీరు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు

Also Read: తమ్ముడి శవాన్ని ఒడిలో పెట్టుకుని.. అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్న 8 ఏళ్ల అన్న! కనీళ్లు పెట్టిస్తున్న వీడియో  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News