VK Naresh Defamation Case : యూట్యూబ్‌ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్‌ యుద్దం

VK Naresh Defamation Case సీనియర్ నటుడు నరేష్‌, పవిత్రల మధ్య బంధం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వాటికి అడ్డుకట్ట వేసేందుకు నరేష్, పవిత్రల ముందడుగు వేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 11:14 AM IST
  • సోషల్ మీడియాలో నరేష్‌ పవిత్ర బంధం మీద చర్చలు
  • సీనియర్ నటీనటుల మీద దారుణమైన ట్రోలింగ్
  • నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫోకస్
VK Naresh Defamation Case : యూట్యూబ్‌ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్‌ యుద్దం

VK Naresh Defamation Case : సోషల్ మీడియాలో ప్రస్తుతం సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. వారి పర్సనల్ జీవితాల మీద నెటిజన్లు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ మధ్య అయితే నరేష్, పవిత్రల బంధం మీద నానా హంగామా జరిగింది. ఏదైనా సినిమాలో ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే జనాలు గోల గోల చేసేస్తున్నారు. అంటే ఆ రేంజ్‌లో వీరి బంధం మీద ట్రోల్స్ జరిగాయి. అంతలా జనాల్లోకి వెళ్లిపోయారని అర్థం.

నరేష్‌ పవిత్రల ఇష్యూ ఇంతగా వైరల్ అవ్వడానికి కారణం రమ్య రఘుపతి. నరేష్‌ మూడో భార్యగా తాను ఉన్నానని, ఇంకా విడాకులు అవ్వలేదని, అలాంటిది పవిత్రతో ఎలా ఉంటాడని, పెళ్లికి ఎలా రెడీ అవుతాడు? అంటూ ఇలా నానా రకాలుగా రమ్యా రఘుపతి మీడియా ముందు హంగామా చేసింది. హోటల్లో నరేష్‌, పవిత్రలు ఉంటే.. అక్కడి వెళ్లిన రమ్య రచ్చ రచ్చ చేసింది. ఇదంతా కూడా మీడియాలో బాగానే వైరల్ అయింది.

అయితే తమ మీద ట్రోలింగ్ శ్రుతి మించుతోందని, ఇదంతా కావాలనే చేయిస్తున్నారంటూ పవిత్ర మీడియా ముందు వాపోయింది. రమ్య రఘుపతి మీద, కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ చానెళ్ల మీద కేసు వేశానంటూ పవిత్ర చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నరేష్‌ వంతు వచ్చినట్టుంది. నరేష్‌ సైతం నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశాడు. తమ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఓ పన్నెండు మంది మీద పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని యూట్యూబ్ చానెళ్లకు నోటీసులు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.

మొత్తానికి నరేష్‌, పవిత్రలు మాత్రం మీద జరుగుతున్న ఈ ట్రోలింగ్ పట్ల కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి వీరు వేస్తోన్న కేసుల ద్వారా అయినా ఈ ట్రోలింగ్ తగ్గుతుందా? అన్నది చూడాలి. ఏది ఏమైనా మునుపటి కంటే ఎక్కువే క్రేజ్ దక్కించుకుంది ఈ జోడి.

Also Read : Golden GLobe 2023 : గోల్డెన్ గ్లోబ్‌ నామినేషన్‌ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రానుందా?

Also Read : Nagababu : జబర్దస్త్ రోజుల నాటి ఫోటోను షేర్ చేసిన నాగబాబు.. గెటప్ శ్రీను కోసం స్పెషల్ పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News