Case against Suriya: చిక్కుల్లో సూర్య సినిమా

Surarai pottru in troubles : నీట్ పరీక్ష నిర్వహణపై తమిళ స్టార్ హీరో సూర్య చేసిన ట్వీట్‌ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే తాజాగా సూర్య మరో వివాదంలో చిక్కుకున్నాడు.

Last Updated : Sep 18, 2020, 03:05 AM IST
Case against Suriya: చిక్కుల్లో సూర్య సినిమా

Surarai pottru in troubles : నీట్ పరీక్ష నిర్వహణపై తమిళ స్టార్ హీరో సూర్య చేసిన ట్వీట్‌, ఆయన వెల్లడించిన అభిప్రాయం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని.. అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులను ఆదేశించాలని కోరుతూ జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణియన్ అనే జడ్జి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలువురు రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదులు సూర్యకు అండగా నిలుస్తూ అతడిపై చర్యలకు ఉపక్రమించొద్దంటూ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయడం కూడా జరిగిపోయింది. మరోవైపు సూర్య అభిమానులు, ఇతర స్టార్ హీరోలు సైతం సూర్యకి మద్దతుగా నిలబడి తమిళనాడు స్టాండ్స్ విత్ సూర్య #TNStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. Also read : SS Rajamouli safari tour: మొక్కు తీర్చుకుని సఫారి టూర్ ఎంజాయ్ చేసిన రాజమౌళి దంపతులు

ఇది ఇలా ఉండగా.. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే తాజాగా సూర్య మరో వివాదంలో చిక్కుకున్నాడు. సూర్య ( Suriya ) త్వరలో విడుదల చేయనున్న 'సూరరై పొట్రూ' ( Surarai pottru ) సినిమాలోని ‘మన్నూరుంద మేళా’ అనే పాటలోని ( Mannurunda Mela song lyrics ) రెండు పంక్తులు దిగువ, ఉన్నత కులాల మధ్య శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ధర్మపురి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. Also read : Rang De movie: ఆర్జీవీ చిత్రాల తరహాలోనే రంగ్ దే ?

తెలుగులో ఆకాశం నీ హద్దురా ( Aakasam nee haddura ) అనే పేరుతో విడుదల కానున్న ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్నారు. ఆకాశం నీ హద్దురా టీజర్‌కి ( Aakasam nee haddura teaser ) సైతం భారీ స్పందన లభించింది. ఆకాశమే నీ హద్దురా టీజర్‌ చూస్తే.. సూర్య మరోసారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడని అనిపించకమానదు. సూర్య హీరోగా వస్తున్న 'సూరరై పొట్రూ' సినిమాని సూర్య స్వయంగా నిర్మించాడు. ఓటిటిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని గురు ఫేమ్ సుధ కొంగర డైరెక్ట్ చేశారు. Also read : T cells immunity: కరోనావైరస్ తిక్క కుదిర్చే కణాలు ఇవేనట

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News