Sonu Sood To sponsor Dead Body freezer boxes | కరోనా వ్యాప్తి మొదలైన గత ఏడాది నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, పేదలు, వలస కూలీలు, కార్మికులతో పాటు సెలబ్రిటీలకు సైతం తన సహాయ సహకారాలు అందించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేవ్, తెలంగాణ రాష్ట్రాల్లో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను సోనూ సూద్ సమకూర్చుతున్నారు.
డెడ్ బాడీ ఫ్రీజర్ పంపిణీలో భాగంగా సంకిరెడ్డిపల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర మరియు ఇతర గ్రామాల్లో మృతదేహాల సంరక్షణ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బ్యాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆయా గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్(Sonu Sood)ను సంప్రదించారు. దీంతో వారికి కోరిన సాయం చేసేందుకు టాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముందుకొచ్చారు.
Also Read: Retired Headmaster Kotaiah Dies: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి
.@Sonusood going to sponsor dead body freezer boxes in needy villages !!!#Sonusood pic.twitter.com/80zAcYoT2x
— BARaju's Team (@baraju_SuperHit) May 31, 2021
ఈ గ్రామాల ప్రజలు సమీపం నగరం నుంచి ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చి మృతదేహాలు కుళ్లిపోకుండా చేసేందుకు కష్టపడ్డారు. కానీ వారికి డెడ్ బాడీ ఫ్రీజర్ ఆలస్యంగా దొరకడం, అసలు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాలతో మృతదేహాలు కుళ్లిపోవడంతో బంధువులకు చివరిచూపు కరువయ్యేది. ఇది చాలా బాధాకరం. అసౌకర్యాలకు కారణమైంది. కరోనా వైరస్ (CoronaVirus) సెకండ్ వేవ్ నేపథ్యంలో సహాయం కోసం సోనూ సూద్‌ను సంప్రదించగా, ఎంపిక చేసిన గ్రామాలకు వీలైనంత త్వరగా డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచుతామని సర్పంచ్‌లకు నటుడు సోనూ సూద్ హామీ ఇచ్చారు.
Also Read: Corona Cases Updates: ఇండియాలో కరోనా తగ్గుముఖం, 50 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook