Sanjay Dutt Health Condition: సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆందోళన!

నటుడు సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో (Sanjay Dutt Latest Photo) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజయ్ దత్ (Sanjay Dutt) ఫొటో చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు హీరో ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Oct 5, 2020, 09:33 AM IST
Sanjay Dutt Health Condition: సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆందోళన!

బాలీవుడ్ (Bollywood) నటుడు సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో (Sanjay Dutt Latest Photo) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజయ్ దత్ (Sanjay Dutt) ఫొటో చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు హీరో ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. బ్లూ కలర్ టీషర్ట్, డార్క్ బ్లూ కార్గో ప్ల్యాంట్, వైట్ కాన్వాస్ షూ ధరించి సంజయ్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖం మునుపటిగా లేదు, బరువు చాలావరకు తగ్గినట్లుగా ఆ ఫొటోలో కనిపిస్తున్నారు .

సంజయ్ దత్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని, మళ్లీ షూటింగ్స్‌లో బిజీగా మారాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సంజయ్.. తాను ట్రీట్‌మెంట్ కోసం కాస్త విరామం తీసుకుంటున్నట్లు ఆగస్టు 11న ప్రకటించారు.

 

 
 
 

 
 
 
 
 
 
 
 
 

#Sanjaydutt ☹ #getwellsoon

A post shared by Silverlining-India (@silverliningindia1) on

ప్రస్తుతం సంజయ్ దత్ చేతిలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ఉంది. అందులో యాంటగోనిస్ట్ అధీర పాత్రలో కనిపించనున్నారు. చివరగా సడక్ 2 సినిమాలో కనిపించారు సంజయ్ దత్. మరో సినిమా ‘భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ త్వరలో విడుదలకానుంది. రణబీర్ కపూర్, వాణీ కపూర్‌లలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో మరో మూవీకి సైతం సంజయ్ దత్ సంతకం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News