Actor Naresh: లగ్జరీ కారవాన్‌ని కొనుగోలు చేసిన సీనియర్ నటుడు నరేశ్

Actor Naresh:  సీనియర్ నటుడు నరేశ్‌ లగ్జరీ కారవాన్‌ని కొనుగోలు చేశాడు. తనకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా దాన్ని ఏర్పాటు చేయించుకున్నారట.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 03:30 PM IST
  • క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న నరేశ్
  • లగ్జరీ కారవాన్‌ని కొనుగోలు చేసిన సీనియర్ నటుడు
Actor Naresh:  లగ్జరీ కారవాన్‌ని కొనుగోలు చేసిన సీనియర్ నటుడు నరేశ్

Actor Naresh:  క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్నారు నటుడు నరేశ్ (Actor Naresh). దీంతో ఆయన ఇంట్లో కంటే కారవాన్‌లోనే (Caravan) ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవాన్ ని వాడటం మంచిది కాదని భావించిన ఆయన ఇటీవల ప్రత్యేకంగా ఓ లగ్జరీ కారవాన్ ని కొనుగోలు చేశారు. తన అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయించుకున్నారు. ఈ వ్యాన్‌ని ఆయన ముంబయి నుంచి తెప్పించుకున్నారు. దీనికోసం ఆయన భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

''నా జీవితంలో 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటుంది. దాంతో కార్ల కోసం ఖర్చుపెట్టే బదులు.. మంచి కారవాన్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేరే వాళ్లు వాడిన కారవాన్‌లో ఉండటం కూడా అంత ఉత్తమం కాదు. నా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని కొనుగోలు చేశాను’'' అని నరేశ్‌ తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుకి ప్రత్యేకంగా కారవాన్ లేదు. అయితే నరేశ్ మాత్రం సొంతంగా కారవాన్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: KGF2 vs Beast: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదా? '‘కేజీఎఫ్-2'’ టార్గెట్ కానుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News