7 Years of Baahubali: బాహుబలి ఈ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Unknown Facts about Baahubali: బాహుబలి విడుదలై నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 04:12 PM IST
7 Years of Baahubali: బాహుబలి ఈ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Unknown Facts about Baahubali: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంలో పెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి అని చెప్పక తప్పదు. రాజమౌళి ఊహల్లోంచి పుట్టిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ సత్తా చాటింది. ఈ సినిమా జూలై 10వ తేదీన 2015 వ సంవత్సరంలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు కలెక్షన్లు సాధించింది అంటే అతిశయోక్తి కాదు. సుమారు 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 650 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి తెలుగు సినీ జగత్తులో బద్దలు కొట్టలేని విధంగా అనేక రికార్డులు సృష్టించింది. 
ప్రభాస్ హీరోగా రానా విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించారు. అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా వంటి వారు ఇద్దరు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా విడుదలై ఏడేళ్లయిపోతుంది అంటే నమ్మక తప్పదు. అయితే ఈ సినిమా గురించి మీకు తెలియని లేదా తెలిసినా అంతగా పట్టించుకోని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

15 మంది
బాహుబలి సినిమా కోసం రాజమౌళి కుటుంబానికి సంబంధించిన 15 మంది పని చేశారని తెలుసా? రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడిగా కీరవాణి, కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, యూనిట్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ, అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి సోదరి, కీరవాణి భార్య శ్రీవల్లి వంటి వారు సుమారు 15 మంది ఈ సినిమా కోసం పని చేశారు. 

ఐదేళ్లు
ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్ లో ఐదేళ్లు వెచ్చించారు. 2012 సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం వరకు మరో ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ప్రభాస్ ఈ సినిమా పూర్తి చేశారు. అయితే ఈ మధ్యలో సోనాక్షి సిన్హా అజయ్ దేవగన్ జంటగా నటించిన యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో మాత్రం కనిపించారు. 

క్లైమాక్స్ 
ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఒక్కదానికే సుమారు 30 కోట్ల రూపాయల ఖర్చయ్యాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేయడం కోసం అనేక మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు కూడా పనిచేశారు. గ్రాఫిక్స్ కు పెద్దపీట వేయడంతో సుమారు 30 కోట్ల దాకా ఖర్చయింది. 

విఎఫ్ఎక్స్ షాట్స్
ఇక ఈ సినిమా కోసం 2500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా 36 స్టూడియోలలో ఈ సినిమా కోసం విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారు. సుమారు 1300 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కామిక్ బుక్స్
ఒక సినిమాలోని పాత్రను సినిమాతో సంబంధం లేకుండా డెవలప్ చేయడం బహుశా ఈ సినిమాతోనే జరిగి ఉండొచ్చు. రమ్యకృష్ణ పోషించిన శివగామి అనే పాత్ర పేరుతో కొన్ని కామిక్ బుక్స్ కూడా వచ్చాయి అంటే సినిమాకి ఏ మేర క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

9000 ధియేటర్లలో
ప్రపంచవ్యాప్తంగా 9000 ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఒక్క భారతదేశంలోనే 6500 స్క్రీన్ లలో విడుదలైంది అంటే సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ సబు సిరిల్ సుమారు 1500 స్కెచ్ లు రెడీ చేయగా అందులో ఒక దాన్ని ఫైనల్ చేసి మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పటికీ సినిమాకి సంబంధించిన కొన్ని సెట్స్ రామోజీ ఫిలిం సిటీలో అలాగే ప్రేక్షకుల సందర్శనార్థం ఉంచేశారు. 

 జిమ్ సెటప్  గిఫ్ట్ గా
అలాగే ఈ సినిమాలో నటీనటులు ధరించడం కోసం 1500 వెరైటీలకు ఆభరణాలు తయారు చేయించారు. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క విధంగా ఈ ఆభరణాలు తయారు చేయించారు రాజమౌళి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా నిర్మాతలు కోటిన్నర రూపాయల జిమ్ సెటప్ ప్రభాస్ ఇంటిలో ఈ సినిమా కోసమే ఏర్పాటు చేశారు. గతంలో ప్రభాస్ కాస్త దృఢంగానే ఉన్న ఆయనను మరింత దృఢంగా తయారు చేసేందుకు ఈ జిమ్ ఎక్విప్మెంట్ ని ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చారు.

Also Read: Anchor Suma: సుమ బంగారుతల్లి.. ఎవరికీ తెలియని గొప్పవిషయం బయటపెట్టిన సీనియర్ నటి
Also Read: Ananya Nagalla: వెకేషన్లో రచ్చ రేపిన అనన్య.. థైస్ అందాలతో హాట్ ట్రీట్!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News