67th National Awards winners list: 67వ జాతీయ అవార్డుల విజేతల జాబితాను కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ఎటాక్, ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన 2019 కి సంబంధించిన నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ప్రకటనకు ఎట్టకేలకు ఈ సోమవారం మోక్షం లభించింది. గతేడాది జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే మూవీకి (Sushant Singh Rajput's Chhichhore movie) బెస్ట్ హిందీ ఫిలిం అవార్డ్ కైవసం చేసుకుంది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీ ఉత్తమ తెలుగు భాషా చిత్రం అవార్డుతో పాటు బెస్ట్ ఎడిటింగ్ అవార్డ్ సైతం సొంతం చేసుకుంది. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh Babu నటించిన మహర్షి మూవీకి గాను Best Choreography Award కైవసం చేసుకుంది.
బెస్ట్ ఫీచర్ ఫిలిం: మరక్కర్ అరబికడలింటే సింహం (మళయాళం) (Best Feature Film: Marakkar Arabikadalinte Simham (Malayalam))
బెస్ట్ డైరెక్షన్: సంజయ్ పురాన్ సింగ్ (బహత్తర్ హురైన్)
ఉత్తమ నటుడు: తమిళ చిత్రం అసురన్ మూవీకిగాను ధనుష్, భోస్లే చిత్రానికిగాను మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డ్స్ దక్కించుకున్నారు. (Best Actor: Manoj Bajpayee for Bhonsle movie, Dhanush for Asuran movie)
ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగ చిత్రాలు) (Best Actress: Kangana Ranaut for Manikarnika, Panga)
ఉత్తమ తెలుగు భాషా చిత్రం: జెర్సీ (Best Telugu Film: Jersey movie)
ఉత్తమ హిందీ భాషా చిత్రం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం చిచోరే. (Best Hindi Film: Chhichhore movie)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి ( ది టస్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (సూపర్ డిలక్స్)
ఉత్తమ బాలల చిత్రం: కస్తూరి ( హిందీ చిత్రం)
ఉత్తమ కొరియోగ్రఫీ: మహేష్ బాబు నటించిన మహర్షి మూవీకి గాను రాజు సుందరం బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డ్ కైవసం చేసుకున్నాడు. (Best Choreography: Mahesh Babu's Maharshi movie (Telugu))
బెస్ట్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్: బెస్ట్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అందించిన చిత్రాల జాబితాలో మహర్షి మూవీకి మరో నేషనల్ అవార్డ్ దక్కింది.
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిం: మరక్కర్ అరబికడలింటే సింహం (మళయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: ఒత్త సెరుప్పు సైజ్-7 (తమిళం)
బెస్ట్ లిరిక్స్: కొలాంబి (మళయాళం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్స్: విశ్వం (తమిళం)
బెస్ట్ ఎడిటింగ్: జెర్సీ మూవీకి గాను నవీన్ నూలీ బెస్ట్ ఎడిటర్ అవార్డ్ దక్కించుకున్నాడు. (Best Editing: Naveen Nooli for Jersey movie (Telugu))
ఉత్తమ నేపథ్య గాయని: బార్డో (మరాఠి)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కేస్రీ
మోస్ట్ ఫిలిం-ఫ్రెండ్లీ స్టేట్: సిక్కిం
Also read : Gaali Sampath Movie On OTT: ఓటీటీ వేదిక అమెజాన్ Prime Videoలో గాలి సంపత్ వచ్చేసింది, వీక్షించడమే ఆలస్యం
తెలుగులో నాలుగు నేషనల్ అవార్డ్స్ రాగా.. అందులో రెండు జెర్సీ మూవీకి మరో రెండు మహర్షి మూవీకి వచ్చాయి. గౌతం తిన్ననూరి డైరెక్షన్లో Nani నటించిన జెర్సీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా, Mahesh Babu నటించిన మహర్షి మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook