MLA Rajaiah Harassments Case: రాజయ్యపై కేసు నమోదు చేయలేమంటున్న సీఐ

MLA Rajaiah Harassments Case: స్టేషన్ ఘణపూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనని వేధిస్తున్నాడు అంటూ హనుమకొండ జిల్లా, దర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

Written by - Pavan | Last Updated : Jun 26, 2023, 06:27 AM IST
MLA Rajaiah Harassments Case: రాజయ్యపై కేసు నమోదు చేయలేమంటున్న సీఐ

MLA Rajaiah Harassments Case: స్టేషన్ ఘణపూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనని వేధిస్తున్నాడు అంటూ హనుమకొండ జిల్లా, దర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే తాను ఎమ్మెల్యేపై బహిరంగ వ్యాఖ్యలు చేశానో.. అప్పటి నుంచి తనపై వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. ఎమ్మెల్యే పీఏ సైతం వేధిస్తున్నారని మహిళా సర్పంచ్ నవ్య మీడియా ఎదుట వాపోవడంతో రాజయ్య వేధింపుల పర్వం అంటూ ఈ వార్తకు మరింత ప్రాధాన్యత చేకూరింది. 

ఈసారి తనని వేధించేందుకు తనపైకి ఏకంగా తన భర్తనే ప్రయోగించారని నవ్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసలు తనని వేధించనే లేదని.. కావాలనే మరొక నేత ప్రోద్భలంతో తాను ఈ ఆరోపణలు చేశానని అంగీకరిస్తూ ఒక బాండ్ పేపర్ పై సంతకం చేస్తే... నీకు 20 లక్షలు అప్పుగా ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే రాజయ్య పెట్టిన ఈ ప్రతిపాదనకు ఒప్పుకుని సంతకం చేసి తీరాల్సిందేనని ఎమ్మెల్యే పీఏ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు నవ్య చెప్పుకొచ్చారు.

నవ్య చేసిన ఈ ఆరోపణలపై స్పందించిన ధర్మసాగర్ సీఐ.. ఆమె ఎమ్మెల్యేపై చేస్తోన్న ఆరోపణలకు తగిన ఆధారాలు చూపిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెబుతూ నోటీసులు జారీచేశారు. ధర్మసాగర్ సీఐ నోటీసులకు స్పందించిన నవ్య.. తన వద్ద ఉన్న రెండు ఆడియో టేప్స్ వినిపించాను అని మీడియాకు తెలిపారు. అయినప్పటికీ ఎమ్మెల్యే రాజయ్యపై కేసు నమోదు చేయడానికి ఆ 2 ఆడియో రికార్డ్స్ సరిపోవు అని పోలీసులు చెప్పారని సర్పంచ్ నవ్య అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎమ్మెల్యే పక్షాన ఉండటం వల్లే తనకు న్యాయం జరగడం లేదని.. అయినప్పటికీ తన న్యాయ పోరాటం ఆగదని నవ్య స్పష్టంచేశారు. లాయర్‌తో మాట్లాడి న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం మీడియాకు ఆడియో రికార్డ్స్ విడుదల చేస్తాను అని నవ్య తేల్చిచెప్పారు. 

ఇది కూడా చదవండి : BRS MLA Rajaiah: దరువేసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

ఇదిలావుంటే, ఈ ఘటనపై ధర్మసాగర్ సిఐ స్పందిస్తూ.. సరైన ఆడియో రికార్డ్స్, డాక్యుమెంట్ రికార్డ్స్ లేనందున కేసు నమోదు చేయలేకపోతున్నాం అని అన్నారు. మేము ఇచ్చిన నోటీసులకు జానకిపురం సర్పంచ్ నవ్య సరైన ఆధారాలు సమర్పించలేదు అని చెప్పిన ధర్మసాగర్ సీఐ.. ఆమె ఆధారాలు ఎప్పుడు సమర్పిస్తే అప్పుడు తప్పకుండా కేసు నమోదు చేస్తాం అని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి : Sarpanch Navya About BRS MLA Rajaiah: నవ్య ఫిర్యాదుపై స్పందించిన జాతీయ, తెలంగాణ మహిళా కమిషన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News