ORR Accident Prone Area: వేగానికి హద్దులు లేవు.. రయ్‌న దూసుకెళ్లడమే. నగరం మధ్యలో నుంచి కాకుండా శివారు ప్రాంతాల్లోకి చేరుకునేందుకు రాజీవ్ గాంధీ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుతో ఎంతమంది ప్రయాణ సమయం తగ్గిందో తెలియదు. కానీ ఎంతో మంది ఆయువు మాత్రం తగ్గింది. ఈ రోడ్డు ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కూడా అక్కడే జరిగింది. ఆ రోడ్డు నిత్యం నెత్తుటి మరకలతో నిండిపోతుంది. ఆ రోడ్డు సామాన్యులతో పాటు ఎందరో ప్రముఖులను బలిగొన్నది. మంత్రి కోమటిరెడ్డి కుమారుడుతో సహా వీఐపీలను పెద్ద ఎత్తున పొట్టన పెట్టుకుంది. ఔఆర్‌ఆర్‌పై జరిగిన మరణాల్లో పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు. లాస్య నందిత ప్రమాదంతో మరోసారి ఆ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.
Also Read: Basara IIIT Student: బావ లేని బతుకు నాకొద్దు.. తనని కాల్చిన చోటే నన్ను కాల్చండి
రవితేజ సోదరుడు
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో సినీ నటుడు రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్ రాజు మృతి చెందాడు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై స్కోడా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: Friend Fraud: స్నేహితుడి నమ్మకద్రోహం.. ఆపదలో ఉన్నాడని సహాయం చేస్తే ప్రాణమే తీశాడు
కోట శ్రీనివాసరావు కుమారుడు
స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్ (39) డీసీఎం వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ సంఘటన 20 జూన్ 2010న ఈ ప్రమాదం జరిగింది. ఫిలింనగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్తుండగా తెలంగాణ పోలీస్ అకాడమీ దాటిన తర్వాత డీసీఎం అకస్మాత్తుగా వచ్చింది. 1000 సీసీ స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న వెంకటసాయి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆకాశంలోకి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కొడుకు మృతిని కోట శ్రీనివాస రావు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు.
అజారుద్దీన్ తనయుడు
భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అయాజుద్దీన్ (19) కూడా ఔఆర్‌ఆర్‌పై మృతి చెందాడు. ఓఆర్ఆర్పై నిర్వహించిన బైక్ రేసింగ్‌లో పాల్గొన్న అయాజుద్దీన్ ఆ సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 17 సెప్టెంబర్ 2011న మృతి చెందాడు.
మంత్రి కోమటిరెడ్డి తనయుడు
ఓఆర్ఆర్పై జరిగని ఘోర ప్రమాదంలో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించడం నాడు తెలుగు రాష్ట్రాలను తీవ్ర విషాదం నింపింది. 19 డిసెంబర్ 2011న పటాన్‌చెరుకు స్నేహితులతో కలిసి ప్రతీక్ రెడ్డి కారులో వెళ్తున్నాడు. అత్యంత వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితోపాటు మరో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.
మరికొన్ని సంఘటనలు కూడా ఓఆర్ఆర్పై చోటుచేసుకున్నాయి. తాజాగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం. అయితే ఓఆర్ఆర్ ప్రయాణానికి ఎంత సౌకర్యంగా.. గమ్యాలకు త్వరగా చేరుకునేందుకు ఉంది. దీంతోపాటు ప్రమాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. ఓఆర్ఆర్ నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నాయని గతంలోనే తేలింది. లోపాలను సరిదిద్దడంలో అధికారులు విఫలమయ్యారు. వీటితోపాటు వాహనాలు నడిపేవారు అత్యంత వేగంగా వెళ్లడం.. అకస్మాత్తుగా వాహనాలు రావడం, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడం, వాహనం నడిపేవారు నిద్రమత్తు, మద్యంమత్తులో ఉండడం వంటి కారణాలతో కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓఆర్ఆర్పైనే కాదు ఏ రోడ్డుపైన అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తే అందరి కుటుంబాల్లోనూ విషాదం అనే పదమే ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి