Rajasthan Murder Case: ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన మహిళ.. భర్తను దారుణంగా హత్య.. ఆ చిన్న క్లూతో గుట్టురట్టు

Wife Kills Husband With Help Of Lover: తన కంటే 13 ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది. అతనితో ఏకాంతంగా గడుపుతూ.. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. తన ప్రేమకు అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది. కానీ చిన్న క్లూతో దొరికిపోయి కటకటాలపాలైంది. వివవరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 08:35 PM IST
Rajasthan Murder Case: ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన మహిళ.. భర్తను దారుణంగా హత్య.. ఆ చిన్న క్లూతో గుట్టురట్టు

Wife Kills Husband With Help Of Lover: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కన్న 13 ఏళ్ల చిన్నవాడి మోజులో పడిన భార్య.. కట్టుకున్న భర్తను కడతేర్చింది. అజ్మీర్ జిల్లాలోని భినయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నహ్రా బాబా కా బడియా ఉదయగర్‌ఖేడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న క్లూతో పోలీసులు కనిపెట్టి.. మహిళతోపాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..  

దేవేంద్ర సింగ్ అలియాస్ చందూ రావత్ (37) అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన భార్య కిరణ్ అలియాస్ సేత ఇంటి వద్దే ఉండేది. ఒంటరిగా ఉన్న ఆమె.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గడిపేది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడాదికి కిందట సర్గావ్‌కు చెంది 22 ఏళ్ల షైతాన్ గుర్జార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి వయసులో దాదాపు 13 ఏళ్ల తేడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ తరువాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇద్దరూ నిత్యం గంటల తరబడి మాట్లాడుకునేవారు. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో వారి స్నేహం ప్రేమగా మారింది. ఆ ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు.

సేతను కలిసిన షైతాన్ గుర్జార్.. నిత్యం ఇంటికి రావడం ప్రారంభించాడు. ఆ తరువాత సేత భర్త దేవేంద్రతో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి మందు పార్టీలు చేసుకుంటూ మంచి స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలో ఒక రోజు దేవేంద్రుడు ఇంట్లోలేని సమయంలో సేత, షైతాన్ ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు. దేవేంద్రుడు సడెన్‌గా ఇంటి రాగా.. ఇద్దరు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో షైతాన్ గుర్జార్‌తో గొడవ పడి అప్పటి నుంచి ఇంటికి రాకుండా చేశాడు.

ప్రియుడిని కలిసేందుకు కుదరకపోడంతో సేత.. ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేసింది. కట్టుకున్న భర్తను కడతేర్చాలని కుట్రపన్నింది. ప్రియుడితో కలిసి ఓ నెల రోజుల పాటు ప్లాన్ చేసుకుంది. ఈ నెల 17న రాత్రి దేవేంద్ర పొలానికి కాపలాగా వెళ్లగా.. సేత తన ప్రియుడు షైతాన్‌కు ఫోన్ చేసి పిలిపించుకుంది. రాత్రి ఇద్దరు కలిసి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ బావి దగ్గర మంచమ్మీద దేవేంద్రుడు నిద్రపోతున్నాడు. 

దేవేంద్రుడిపై షైతాన్ కూర్చోని గొంతు నులిమి హత్య చేశాడు. అతను అరవకుండా సేత ముఖంపై చేయి పెట్టి నొక్కి పట్టుకుంది. దేవేంద్రుడు ఆమె చేతి వేలిని పళ్లతో గట్టిగా కొరికాడు. దేవేంద్రుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా.. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని విధాలుగా విచారించారు. చివరకు మృతుడి భార్య చేతి వేలిపై గాయం గురించి ఆరా తీయగా.. అసలు గుట్టు బయటపడింది. తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.  

Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..

Also Read:  Air India Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. ఎయిర్ ఇండియా రిపబ్లిక్ డే సేల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News