ATM Robbery: ఏటీఎం నుంచి సినీ ఫక్కీలో రూ. 5.60 లక్షలు చోరీ.. ఒక్క క్లూ లేదు.. ఎలాగో తెలుసా ?

ATM Robbery:  నేరస్తులు మరీ తెలివి మీరిపోతున్నారు. కొడితే ఏనుగు కంభస్థలమే కొట్టాలి అన్నట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏకంగా ఏటీఎంలు, బ్యాంకు లాకర్లకే కన్నం వేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఏటీఎం కేంద్రంలో ఓ చోరీ జరిగింది. ఈ చోరీలో దొంగల ముఠా రూ. 5.60 లక్షలు కొట్టేశారు.

Written by - Pavan | Last Updated : Feb 14, 2023, 06:35 AM IST
ATM Robbery: ఏటీఎం నుంచి సినీ ఫక్కీలో రూ. 5.60 లక్షలు చోరీ.. ఒక్క క్లూ లేదు.. ఎలాగో తెలుసా ?

ATM Robbery: ఒక దొంగల ముఠా ఏటీఎం లోకో లేక బ్యాంకు లాకర్ రూమ్ లోకి ప్రవేశించి చడీచప్పుడు కాకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఏ మాత్రం క్లూ ఇవ్వకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి తెలివిగా చోరీ చేసి లక్షలు, కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలతో ఉడాయిస్తుంది. తెల్లవారితే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఒక్క క్లూ మిగలదు. ఇలాంటి సీన్స్ ఒకప్పుడు హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఇప్పుడు మన ఇండియన్ సెల్యూలాయిడ్‌పై కూడా బోలెడన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రియల్ చోరీ సీన్ కూడా అలాంటిదే. 

నేరస్తులు మరీ తెలివి మీరిపోతున్నారు. కొడితే ఏనుగు కంభస్థలమే కొట్టాలి అన్నట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏకంగా ఏటీఎంలు, బ్యాంకు లాకర్లకే కన్నం వేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఏటీఎం కేంద్రంలో ఓ చోరీ జరిగింది. ఈ చోరీలో దొంగల ముఠా రూ. 5.60 లక్షలు కొట్టేశారు. గతేడాది అక్టోబర్ 28న జరిగిన ఈ ఘటనపై తాజాగా ఫిబ్రవరి 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క క్లూ దొరకలేదు. 

చోరీ ఎలా జరిగిందంటే..
ఏటీఎం సెంటర్‌లోకి ప్రవేశించిన దొంగలు ముందుగా లోకల్ ఏరియా నెట్‌వర్క్ (LAN) కనెక్షన్‌ని డిస్‌కనెక్ట్ చేశారు. ఏటీఎం సెంటర్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లగానే తమ వద్ద ఉన్న మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసి ఏటీఎం సిస్టంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఏటీఎం నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేసి రూ. 5.60 లక్షలు కాజేశారు. ఆ సమయంలో ఏటీఎం సిస్టంలో మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయి ఉండటంతో ఆ అనధికారిక లావాదేవీలు కూడా రికార్డ్ అవలేదు. అలా తెలివిగా, సులువుగా తమ పని కానిచ్చుకుని డబ్బుతో ఉడాయించారు.

ఇది కూడా చదవండి : Jalakantha Lucky Stone: లక్కీ స్టోన్ జలకాంత అని చెప్పి రూ. 2 కోట్లకు ఉత్తి రాయిని అమ్మబోయారు

ఇది కూడా చదవండి : Railway Track Stolen: వింత దొంగతనం.. 2 కిలోమీటర్ల రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన దొంగలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News