UP Crime news: యూపీలోని మెయిన్‌పురిలో (Uttar Pradesh's Mainpuri) విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో చేసిన టీ తాగి ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన నాగ్లా కన్హై గ్రామంలో (kanhai village) గురువారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఎస్పీ కమలేశ్ దీక్షిత్ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... భాయిదూజ్ సందర్భంగా.. నాగ్లా కన్హై గ్రామంలోని శివానందన్ (35), అతని కుమారులు శివంగ్ (6), దివ్యాంష్ (5), అతని బావ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ (45)తో కలిసి ఇంట్లో చేసిన టీ తాగారు. ఛాయ్ తాగిన వెంటనే వీరందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరందరినీ జిల్లా అస్పత్రికి తరలించగా.. అప్పటికే రవీంద్ర సింగ్, శివాంగ్, దివ్యాన్ష్ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. సోబ్రాన్, శివానందన్‌ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సైఫాయి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరూ మృతి చెందారు.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు. టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు వరి పంటకు వాడే పిచికారీ మందును కలిపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
#मैनपुरी के थाना औंछा क्षेत्र के ग्राम कन्हई में चाय पीने से एक व्यक्ति व 02 बच्चों की मृत्यु होने के संबंध में अपर पुलिस अधीक्षक मैनपुरी द्वारा दी गई बाईट।#UPPolice pic.twitter.com/w5VE82fGmb
— MAINPURI POLICE (@mainpuripolice) October 27, 2022
Also Read: Bhopal Gas Leak: భోపాల్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్... పలువురికి అస్వస్థత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి