Crime News: బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చిన దుర్మార్గులు.. వీడియో వైరల్

Minor Boy Tortured, Filmed: హైదరాబాద్​లో చోటుచేసుకున్న మరో అమానుషమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మానస్థిక పరిస్థితి సరిగ్గా లేని 16 ఏళ్ల మైనర్ బాలుడిని బంధించి అత్యంత పాశవికంగా ఆ బాలుడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు కొంతమంది యువకులు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 05:36 AM IST
 Crime News: బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చిన దుర్మార్గులు.. వీడియో వైరల్

Minor Boy Tortured, Filmed: మానవత్వం మర్చిపోయి మైనర్ బాలుడిని అతి దారుణంగా హింసించి అతడి మర్మాంగాలపై టపాసులు కాల్చడమే కాకుండా అత్యంత హేయమైన ఆ దుర్మార్గపు చర్యను వీడియో తీసి వైరల్ చేశారు. బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ​ప్రదేశ్​ ఖుషీనగర్​కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడిని బతుకుదెరువు కోసం హైదరాబాద్ శివార్లలోని ఓ రెడీమిక్స్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు వారి బంధువులు మూడు నెలల క్రితం హైదరాబాద్‌కి పంపించారు. 

అయితే, బాలుడి అమాయకత్వాన్ని, అభంశుభం తెలియని పసి మనస్తత్వాన్ని ఆసరగా తీసుకున్న యువకులు ఆ బాలుడిని గత కొన్ని రోజుల నుంచి స్థానిక యువకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వారి ఆగడాలు మరింత శృతిమించి చిన్న పిల్లాడు అనే విచక్షణ కూడా లేకుండా ఇలా దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం అందుతోంది. 

బాలుడిని కదలకుండా తాడుతో గట్టిగా కట్టేసి పట్టుకున్న యువకులు.. అతడి వీపు కింది భాగంలో టపాసులు కాల్చి అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. తనను విడిచిపెట్టాలని ఆ బాలుడు ఏడుస్తూ ఎంత బతిమిలాడినా ఆ దుర్మార్గుల మనసు కరగలేదు. అతడిని విడిచిపెట్టలేదు. తమ దుర్మార్గపు చర్యలతో పైశాచికానందం పొందారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఏదో ఘనకార్యం చేసిన చందంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ బండారం ఎక్కడ బయడపెడతాడేమోననే భయంతో బాలుడి సెల్ ఫోన్ లాక్కున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో చూసి నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక బాలుడి పట్ల.. అది కూడా మానస్థిక పరిస్థితి సరిగ్గా లేని పిల్లాడితో ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అంటూ నెటిజెన్స్ బూతులు తిడుతున్నారు. 

వీడియో వైరల్ అవడంతో..
బాలుడి మర్మాంగాలపై టాపాసులు పేల్చిన వీడియో వైరల్ అవడంతో ఉత్తర్ ప్రదేశ్‌ లో మైనర్ బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. దీంతో హైదరాబాద్‌ లో తమ కుమారుడిపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకుని అతడిని తమకు సురక్షితంగా అందించడంతో పాటు తమ కుమారుడిపై పైశాచిక దాడులకు పాల్పడుతున్న యువకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Trending News