whatsapp: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవడం

whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో చాలా ఫీచర్లున్నాయి. ఇష్టం లేని వ్యక్తిని బ్లాక్ చేసుకోవచ్చు. అదే మీ నంబర్ బ్లాక్ అయితే..ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవాలి. ఈ సందేహం చాలామందిని వెంటాడుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమిదే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 5, 2022, 07:48 PM IST
whatsapp: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవడం

whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో చాలా ఫీచర్లున్నాయి. ఇష్టం లేని వ్యక్తిని బ్లాక్ చేసుకోవచ్చు. అదే మీ నంబర్ బ్లాక్ అయితే..ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవాలి. ఈ సందేహం చాలామందిని వెంటాడుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమిదే..

వాట్సప్‌లో తెలియని ఎన్నో విషయాలున్నాయి. మరెన్నో ఫీచర్లున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసో తెలియకో మీ నెంబర్‌ను మరొకరు బ్లాక్ చేస్తుంటారు. ఎవరు బ్లాక్ చేశారనేది మీకు తెలియదు కూడా. అది తెలుసుకోవాలంటే సులభమైన పద్ధతొకటి ఉంది. ఇవాళ ఆ చిట్కా ఏంటి, ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫలితంగా మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో క్షణాల్లో తెలుసుకోవచ్చు. 

మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకునేందుకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కాంటాక్ట్ డీపీ కన్పించలేదంటే..మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టు అర్ధం. అయితే కొంతమంది కాంటాక్ట్ డీపీ రిమూవ్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో బ్లాక్ చేశారా లేదా అనేది నిర్ధారించలేం. కానీ బ్లాక్ అయితే మాత్రం కాంటాక్ట్ స్టేటస్ కూడా కన్పించదు. ఈ రెండూ కన్పించకపోతే మాత్రం మిమ్మల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేసినట్టే. 

సంబంధిత యూజర్‌కు మెస్సేజ్ పంపించి కూడా బ్లాక్ చేశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు పంపించిన మెస్సేజ్ డెలివరీ అవుతుంటే..ఎవరరూ మిమ్మల్ని బ్లాక్ చేయలేదని అర్ధం. కానీ డెలివరీ కాకపోతే బ్లాక్ చేసినట్టే. నిజంగా ఎవరైనా బ్లాక్ చేస్తే..ఎట్టి పరిస్థితుల్లోనూ మెస్సేజ్ డెలివరీ కాదు. 

అన్‌బ్లాక్ చేయడం ఎలా

ఒకవేళ మీరు ఎవరినైనా వాట్సప్‌లో అన్‌బ్లాక్ చేయాలనుకుంటే.కొంత ప్రోసెస్ ఉంటుంది. మరొకరి కాంటాక్ట్‌లో వెళ్లి మిమ్మల్ని మీరు అన్‌బ్లాక్ చేసుకోలేరు. దీనికోసం అవతలి యూజర్‌కు విజ్ఞప్తి పంపించాల్సి ఉంటుంది. యూజర్ కోరుకుంటేనే మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయవచ్చు. మరో మార్గం లేదు కూడా. బ్లాక్‌లిస్ట్‌లో వెళ్లి మీ నెంబర్‌పై అన్‌బ్లాక్ చేస్తే చాలు. 

Also read: Agnipath Recruitment 2022: అగ్నివీర్ నావికా దళంలో 20 శాతం మహిళల నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News