RBI Repo Rate: ఆర్బీఐ మరోసారి రెపో రేటు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా..వడ్డీ 6.5 శాతం చేసింది. అసలు రెపో రేటు అంటే ఏంటి..?, రెపో రేటు పెరిగిన ప్రతిసారీ ఈఎంఐ ఎందుకు పెరుగుతుందనే వివరాలు తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో వరుసగా ఆర్బీఐ రెపో రేటు పెంచుతంది. ద్రవ్యోల్బణం అదుపు, ధరల నియంత్రణలో భాగంగా ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతోంది. ఆర్బీఐ రెపో రేటును తాజాగా మరోసారి పెంచింది. 25 బేసిస్ పాయింట్లు పెంచి.. 6.5 శాతం చేసింది. ఫలితంగా లోన్ ఈఎంఐ కూడా పెరుగుతుంటోంది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో ఏ విధమైన మార్పు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
రెపో రేటు అంటే ఏమిటి..??
నిధులు తక్కువైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇతర బ్యాంకులు డబ్బులు అప్పు తీసుకుంటాయి. ఈ రెపో రేటు ఓ విధమైన వడ్డీ తప్ప మరొకటి కాదు. అప్పు ఇచ్చిన బ్యాంకుల నుంచి రెపో రేటు రూపంలో ఆర్బీఐ ఫీజు వసూలు చేస్తుంటుంది. మానిటరింగ్ అధారిటీల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఈ విధమైన చర్యలు చేపడుతుంటుంది.
ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచవచ్చు. ఈ రెపో రేటు ఆర్బీఐ నుంచి కమర్షియల్ బ్యాంకులు తీసుకునే రుణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఆర్ధిక వ్యవస్థలో ధన సరఫరాను తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. పెరిగిన రేట్ల ఆధారంగా లోన్ వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పుడు అంటే తగ్గినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తుంది. ఇది ఓ రకమైన ప్రోత్సాహక చర్య. కమర్షియల్ బ్యాంకులు డబ్బులు అప్పులు తీసుకునేందుకు ప్రోత్సహిస్తాయి. ఆ తరవాత ఈ డబ్బుల్ని కస్టమర్లకు అందిస్తారు. ఫలితంగా ధన ప్రవాహం పెరుగుతుంది.
పెరగనున్న ఈఎంఐ
ఆర్బీఐ ఎప్పుడు రెపో రేటును పెంచినా.. బ్యాంకులు ఆర్బీఐకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దాంతో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. దీని ప్రభావం నేరుగా ఈఎంఐలపై పడుతుంది. రుణాలపై వడ్డీ పెరుగుతుంది.
Also read: RBI Hikes Repo Rate: లోన్లు తీసుకున్న వారికి షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
RBI Repo Rate: రెపో రేటు అంటే ఏమిటి..? రెపో రేటు పెరిగితే ఈఎంఐ ఎందుకు పెరుగుతుంది..?