మరో 3 కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానున్న హొండా.. అవేంటంటే..?

హొండా కార్ల సంస్థ నెక్స్ట్ జనరేషన్ అమేజ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది 2024 మొదటి త్రైమాసికామ్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ కాదు డిజైన్, ఇంటీరియర్ మరియు అండర్‌పిన్నింగ్ పెద్ద మార్పులు జరగనున్నట్లు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 05:29 PM IST
మరో 3 కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానున్న హొండా.. అవేంటంటే..?

Upcoming Cars from Honda: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా ఇటీవల భారతదేశంలో ఎలివేట్ మిడ్-సైజ్ SUVని విడుదల చేసింది. ఈ SUV కొన్న వినియోగదారుల నుండి మంచి సానుకూల స్పందనను పొందింది మరియు సెప్టెంబర్ నెలలో 5800 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది. రాబోయే రోజుల్లో ఇండియాలో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు హోండా కార్స్ ప్రకటించింది. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో భారత్ లో రానున్న కొత్త హోండా కార్ల గురించి తెలుసుకుందాం. 

కొత్త అమేజ్
హోండా సంస్ధ నెక్స్ట్ జనరేషన్ అమేజ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది రానున్న 2024 మొదటి త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. డిజైన్, ఇంటీరియర్ మరియు అండర్‌పిన్నింగ్ పరంగా మార్పులు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా రానున్న హొండా అమేజ్ డిజైన్  కానీ.. స్టైలింగ్ కానీ.. హొండా సిటీ నుండి తీసుకోవచ్చని అంచనా. నెక్స్ట్ జనరేషన్ అమేజ్ లో ADAS టెక్నాలజీ తో పాటుగా.. లేన్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఉన్నయాని సమాచారం. కాకపొతే ఇంజన్ మాత్రం పాత అమేజ్ దే ఉండవచ్చు. 

హోండా విడుదల చేసిన కొత్త ఎలివేట్ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి స్పందన లభించటంతో కంపెనీ ఇప్పుడు కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇండోనేషియాలో అమ్ముతున్న కొత్త తరం WR-V సబ్-4 మీటర్ SUVని కంపెనీ మన దేశంలో కూడా లాంచ్ చేయవచ్చు. ఈ కొత్త SUV హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి కార్లకు పోటీనిస్తుంది. ఈ కొత్త SUV యొక్క ఇంటీరియర్ లేఅవుట్ మరియు ఫీచర్లు ఎలివేట్ కాంపాక్ట్ SUV మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.

Also Read: PPF Account 2023: పీపీఎఫ్‌ అకౌంట్ ఓపెన్‌ చేయాలని అనుకుంటున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ  

హోండా ఎలివేట్ ఎలక్ట్రిక్
హొండా తన కొత్త ఎలివేట్ SUVని విడుదల చేస్తున్నప్పుడు, రాబోయే మూడు సంవత్సరాలలో అనగా 2025-26 సంవత్సరంలో హొండా మిడ్ సైజు SUVని భారత్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఎలక్ట్రిక్ SUV MG ZS EV, మహీంద్రా XUV400 మరియు రాబోయే మారుతి సుజుకి EVX మరియు హ్యుందాయ్ క్రెటా EVలకు పోటీగా రానుంది. ఈ ఎలక్ట్రికల్ SUV కారు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ రావచ్చని అంచనా. 

Also Read: Balakrishna: ఆడపిల్ల తల్లిదండ్రులకు భారీ క్లాస్ పీకిన బాలకృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

Trending News