Pradhana Mantri Mudra Yojana: కేంద్రప్రభుత్వం ప్రజల కోసం వివిధ పథకాలను ప్రారంభించింది. కొన్ని నేరుగా వారికి లబ్ది చేకూరుస్తాయి. కానీ, వడ్డీ, గ్యారెంటీ లేకుండా రుణం పొందాలని చాలా మంది ఎందురు చూస్తుంటారు. ఈరోజు మనం అలాంటి ఒక రుణ సదుపాయం గురించి తెలుసుకుందాం. దీని ద్వారా మీరు రూపాయి కూడా వడ్డీ చెల్లించాల్సిన అవసంరలేదు. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఎటువంటి హామీ లేని రుణం పొందుతారు.
ఈ పథకం ప్రధాన మంత్రి ముద్రా యోజన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. అర్హులైనవారు ఈ పథకం కింద రుణ సదుపాయాన్ని సులభంగా పొందుతారు. దేశవ్యాప్తంగా ఉన్న అందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికే చాలామంది లబ్దిదారులు ఈ పథకం కింద లబ్ది పొందారు. అయితే, ఈ రుణ సదుపాయం మీరు కూడా పొందాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎంతో తేలిక. కానీ, నియమాలను అతిక్రమిస్తే లబ్ది పొందలేరు.
ఇదీ చదవండి: బ్యాంక్ కస్టమర్స్‌కు భారీ అలర్ట్.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు.. లిస్ట్ ఇదే..
ఈ ప్రధాన మంత్రి ముద్రా యోజన మూడు ఫేజుల్లో రుణాన్ని మంజూరు చేస్తుంది. శిశు లోన్, కిశోర్ లోన్, తరుణ్ లోన్. శిశు లోన్‌లో భాగంగా మీరు రూ.50 వేల వరకు రుణం పొందుతారు. ఆ తర్వాత కిశోర్ లోన్ ఈ కేటగిరీలో మీరు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయాన్ని పొందుతారు. తరుణ్ లోన్ పథకంలో భాగంగా మీరు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందుతారు. ఈ పథకం పొందడానికి ఎటువంటి గ్యారెంటీ అవసరంలేదు. దీనిపై వడ్డీరేటు 9 నుంచి 12 శాతం ఉంటుంది.
ఇదీ చదవండి: పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి.. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!
ప్రధాన మంత్రి ముద్రా యోజన చిన్న చిన్న కిరణా కొట్టువారితోపాటు వ్యాపారాలు విస్తరించేవారికి కూడా ఉపయోగపడుతుంది. కొత్తగా బిజినెస్ ప్రారంభించేవారు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు ఏ బిజినెస్ ప్రారంభించబోతున్నారు? మీ ప్లాన్ ఎంటి? వివరించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ముద్రా యోజనకు దరఖాస్తు చేసుకునేవారు మీ దగ్గర్లలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెళ్లి మీ వివరాలు తెలిపి అప్లికేషన్ పొందాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఆన్‌లైన్ విధానం కూడా అందుబాటులో ఉంది. ఈ పథకం గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటే www.mudra.org.in ద్వారా తెలుసుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook