Aadhaar Card Updates: ఆధార్ కార్డు. దేశంలో ప్రతి పనికీ ఆధారమైన విశిష్ట గుర్తింపు కార్డు. బహుశా అందుకే ఆధార్ కార్డు దుర్వినియోగం కూడా దేశంలో ఎక్కువౌతోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా, మీకు తెలియకుండా దుర్వినియోగమైందా లేదా ఎలా తెలుసుకోవడం, దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలు ఇప్పుుడు తెలుసుకుందాం..
దేశంలో ప్రతి పనికి అవసరమైన కీలకమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్. ఏ పనైనా సరే..ఆధార్ కార్డు తప్పకుండా కావల్సిందే. మొబైల్ నెంబర్ తీసుకోవాలన్నా..బ్యాంక్ ఎక్కౌంట్ తెరవాలన్నా..విద్యుత్ కనెక్షన్ అయినా..నీటి కనెక్షన్ అయినా..ఇళ్లు కొనాలన్నా..ఇంటి అద్దెకైనా ఇలా ఏ పనైనా సరే..ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డ్ లేకపోతే అన్ని పనులు ఆగిపోయే పరిస్థితి. ఈ పనులన్నింటికీ తప్పకుండా ఆధార్ కార్డు కాపీ సమర్పించాల్సిందే. సరిగ్గా ఈ పరిస్థితిని ఆధారం చేసుకునే దుర్వినియోగం చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. అందుకే కొన్ని కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలంటోంది యూఐడీఏఐ. మీ ఆధార్ కార్డు కాపీని ఎవరికైనా ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే లేని ఇబ్బందులు ఎదురౌతాయి.
ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల కీలక సూచనలు జారీ చేసింది. ఆధార్ కార్డు కాపీని ఎవరితోనూ షేర్ చేయవద్దని సూచించింది. ఆధార్ కార్డు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తెలిపింది. ఆధార్ కార్డును బహిరంగ ప్రదేశాల్లో అంటే పబ్లిక్ కంప్యూటర్లలో ఎప్పుడూ డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తోంది.
ఆధార్ కార్డు లాక్ చేయడమెలా
ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, సురక్షితంగా ఉంచేందుకు ఆన్లైన్లో లాక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు mAadhaar App వినియోగించాల్సి ఉంటుంది. ఈ విధానంతో మీరు మీ కార్డుని బయోమెట్రిక్ లాక్ చేయవచ్చు. దీనికోసం మీకు వర్చువల్ ఐడీ అవసరముంటుంది. ఈ పదహారంకెల నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో పాటు మ్యాప్ చేస్తారు. దీనిని ఆధార్ హెల్ప్‌లైన్ నెంబరా 1947 పై ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. .
మరో విధానం మాస్క్డ్ ఆధార్. ఇది కూడా మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది. ఈ కార్డును మీరు అనధికారిక సంస్థలకు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల మీ ఆధార్ నెంబర్ సురక్షితంగా ఉంటుంది. దీనిని మీరు కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో చివరి 4 అంకెలు మాత్రమే కన్పిస్తాయి. మొదటి 8 అంకెల స్థానంలో ఇంటూ మార్క్స్ ఉంటాయి.
ఇక మరో విధానం ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్‌తో సెక్యూర్ చేయడం. వీటితో మీ ఆధార్ కార్డుని లింక్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇది చాలా అవసరం కూడా. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ రెండింటి ద్వారా మీరు మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేయవచ్చు. ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం myaadhaar.uidai.gov.in/verifyAadhaar క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఆధార్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చేయవచ్చు. ఈ విధానాల ద్వారా తక్షణం మీరు మీ ఆధార్ కార్డును సెక్యూర్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డు ఎక్కడైనా ఎప్పుడైనా సంఘ విద్రోహ కార్యకలాపాలకు వినియోగించుకునే ప్రమాదముంది. అదే జరిగితే లేనిపోని చిక్కుల్లో పడవల్సి వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook