Truecaller Preload in Smartphones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో ఇక నుంచి ముందుగానే ట్రూ కాలర్‌‌ ఇన్‌స్టాల్‌!

Truecaller as Preload App: మరింత మంది కొత్త యూజర్స్‌కు ట్రూ కాలర్‌‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ సంస్థ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో ట్రూకాలర్‌‌ ముందే ఇన్‌స్టాల్ వచ్చేలా చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 01:40 AM IST
  • దూసుకెళ్తోన్న ట్రూ కాలర్‌ యాప్‌
  • ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌లో ప్రీ లోడెడ్‌గా ట్రూ కాలర్
  • స్మార్ట్‌ ఫోన్స్‌ కంపెనీలతో ఒప్పందం
  • స్మార్ట్‌ ఫోన్ యూజర్స్‌ అందరికీ చేరువ అయ్యేందుకు కొత్త నిర్ణయం
Truecaller Preload in Smartphones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో ఇక నుంచి ముందుగానే ట్రూ కాలర్‌‌ ఇన్‌స్టాల్‌!

Truecaller Pre Install: ట్రూ కాలర్‌ యాప్‌ దూసుకెళ్తోంది. కాలర్ ఐడెంటిఫికేషన్‌లో ఈ యాప్‌నకు తిరుగులేదు. అయితే ఇకపై ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌లో ట్రూ కాలర్ యాప్‌ ప్రీ లోడెడ్‌గా రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ కంపెనీలతో ట్రూకాలర్‌‌ యాప్ యాజమాన్యం ఒప్పందాలను కుదుర్చుకుంది. 

అయితే స్మార్ట్‌ ఫోన్లలో (Smart‌ Phones) ఈ యాప్‌ ముందే ఇన్‌స్టాల్‌ అయి వచ్చినా కూడా యూజర్‌‌ ఇష్టాన్ని బట్టీ ఆ యాప్‌ను ఉపయోగించుకునే ఆప్షన్ ఉంటుంది. యూజర్‌‌కు ఇష్టం లేకపోతే ట్రూ కాలర్‌‌ (Truecaller) యాప్‌ను వినియోగించకుండా ఉండే వెసులు బాటు కూడా కల్పించనున్నారు. 

భారత్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, లాటిన్ అమెరికాల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో వంద మిలియన్లకు పైగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో (Android Phones) ట్రూ కాలర్ ముందే ఇన్‌స్టాల్ అయి రానుంది. ఇక గత సంవత్సరం ట్రూ కాలర్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. వీడియో కాలర్ ఐడీతో పలు ఫీచర్స్‌ను పరిచయం చేసింది.

కాగా ఇకపై స్మార్ట్‌ఫోన్స్‌లో (Phones) ట్రూ కాలర్ యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి వస్తుందని ఆ సంస్థ సీఈవో అలెన్‌ మామెది వెల్లడించారు. స్మార్ట్‌ ఫోన్ (Smart Phones) యూజర్స్‌ అందరికీ చేరువ కావాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: Stock Market today: దలాల్​ స్ట్రీట్​లో బేర్ స్వైర విహారం- కుప్పకూలిన మార్కెట్లు..

Also Read: Tata Motors offers: టాటా కార్లపై రూ.60 వేల వరకు డిస్కౌంట్లు- ఆఫర్​ పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News