Truecaller Call Recording: కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ Truecaller లో ఇకపై కాల్ రికార్డింగ్ సదుపాయం అందుబాటులో ఉండబోదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇటీవలే విడుదల చేసిన ఆ ప్రకటనలో కాల్ రికార్డింగ్ ఫీచర్ ను నిలిపేస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఇప్పటికే కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ట్రూ కాలర్ యాప్ ఆపేసింది. అయితే దాని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Truecaller సంస్థ ఇటీవలే విడుదల చేసిన కొత్త ప్రకటన ప్రకారం.. మే నెల నుంచి కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని నిలిపేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ఉచితంగా అందించగా.. ఇప్పుడు దాన్ని యాప్ నుంచి పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది.
కాల్ రికార్డింగ్ తొలగింపునకు కారణం?
Truecaller యాప్ లోని కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని తొలగించనడానికి వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. Google Play Store నిబంధనల ప్రకారం.. యాప్స్ కు రిమోట్ కాల్ రికార్డింగ్ కు అనుమతి లేదు. దీంతో కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ట్రూకాలర్ తొలగించినట్లు తెలుస్తోంది.
Also Read: Apple iPhone Offers: Apple iPhone 12, iPhone 13 మోడల్స్ పై ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్!
Also Read: Disney+Hotstar Free : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ ఉచితం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.