Jimny, Citroen C3 Aircross, SUV Cars Launching in June 2023: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ జూన్ నెలలో మరో ఐదారు కొత్త మోడల్ కార్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అందులో కొన్ని కార్లు ఇండియన్ కస్టమర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మోడల్స్ కూడా ఉన్నాయి. అందులో మారుతి సుజుకి జిమ్నీ, సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్, హోండా ఎలివేట్, వోక్స్‌వాగాన్ వర్చస్ జిటి మ్యాన్యువల్, మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్55 వంటి కార్లు ఉన్నాయి. కొత్తగా ఏదైనా కారు కొనాలి అని ప్లాన్ చేస్తున్న వారి కోసం వారి బడ్జెట్స్ అనుగుణంగా ఉన్న ఈ డిజైన్స్ చూడండి.
గత కొన్నేళ్లుగా ఇండియన్ ఆటోమొబైల్ కస్టమర్స్ ని ఊరిస్తూ వస్తోన్న ఈ మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ ఫార్మాట్లో లాంచ్ అవబోతోంది. 1.5 ఎల్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ జూన్ 6న లాంచ్ కానుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్ సిస్టం మోడల్ ఒకటి కాగా.. మరొకటి మ్యాన్యువల్ గేర్ సిస్టంతో రానుంది. ఇప్పుడప్పుడే మారుతి సుజుకి జిమ్నీ ధరల గురించి చెప్పలేం కానీ కస్టమర్స్ మాత్రం సూపర్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు.
హ్యూందాయ్ నుంచి వస్తోన్న మరో SUV కారు పేరే హ్యూందాయ్ ఎలివేట్. మిడ్ సైజ్ ఎస్‌యూవీ రేంజులో వస్తోన్న ఈ కారు హ్యాందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ వితారా వంటి ఎస్ యూవి కార్లకు హ్యూందాయ్ ఎలివేట్ గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ కారు కూడా జూన్ 6వ తేదీనే లాంచ్ అవనుంది.
Also Read: Dr Subhash Chandra: త్వరలో ఎస్సెల్ గ్రూప్‌కు అప్పుల నుంచి విముక్తి
సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు ఇండియాలో హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ వితారా, టొయొటా హైరైడర్, వోక్స్ వాగాన్ టైగాన్, స్కోడా కుషాక్ లాంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని కంపెనీ భావిస్తోంది. 10.2 అంగుళాల టచ్ స్క్రీన్, రెండో వరుసలో ఏసీ వెంట్స్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 110 హార్స్ పవర్, 6 స్పీడ్ మాన్వల్ గేర్ బాక్సు లాంటి ఎలిమెంట్స్ ఎస్‌యూవీ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటాయని సిట్రోయెన్ ధీమా వ్యక్తంచేస్తోంది.
Also Read: Cheapest Bike: డెడ్ ఛీప్ ధరలతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్ ఇదే..లీటర్‌కు మైలేజీ ఎంతిస్తుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి