Tax Saving Tips 2023: ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా..? సింపుల్‌గా పన్ను ఆదా చేసుకోండి

How To Save Tax: ప్రతి ఒక్కరు ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలని అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయం ముగుస్తుండడంతో అన్ని లెక్కలు సరి చేసుకుంటున్నారు. మీరు కూడా పన్ను ఆదా చేసుకోవాలంటే ఓ సింపుల్ పని చేయండి. మీ ఆదాయంపై ట్యాక్స్ సేవ్ చేసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 04:30 PM IST
Tax Saving Tips 2023: ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా..? సింపుల్‌గా పన్ను ఆదా చేసుకోండి

How To Save Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి గడువు సమయం దగ్గర పడుతోంది. ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియ కూడా ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్‌ సేవ్ చేసుకునేందుకు చివరి అవకాశం మిగిలి ఉంది. బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌ను పెంచిన విషయం తెలిసిందే. కొత్త రూల్ ప్రకారం.. కొత్త పన్ను విధానంలో పన్ను దాఖలు చేయడంపై వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్‌ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే పాత పన్ను విధానంలో ఈ లిమిట్‌ను పెంచలేదు.

పాత పన్ను విధానంలో ఒక వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేస్తే.. అతను పన్ను విధించదగిన ఆదాయంపై పన్ను చెల్లించాలి. అదే సమయంలో ఈ పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల రూపాయల వరకు రాయితీని కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా పాత పన్ను విధానంలో పన్ను దాఖలు చేస్తుంటే.. మార్చి నెలలోనే ఓ పథకంలో పెట్టుబడి పెట్టి.. మీ ట్యాక్స్‌ను సేవ్ చేసుకోండి. 

పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాలి.  రూ.5 లక్షల వార్షిక ఆదాయంపై కూడా రాయితీ లభిస్తుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పన్ను చెల్లించడం ప్రారంభమవుతుంది. పాత పన్ను విధానంలో ట్యాక్స్ ఫైల్ చేసి.. అతని ఆదాయం 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే ట్యాక్స్ సేవ్ చేయడానికి పన్ను ఆదా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.
 
పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. దీని కింద ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 15 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో కాంపౌండింగ్ ప్రాతిపదికన ఏటా 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే ఈ పథకం కింద అందుకున్న మొత్తం, పెట్టుబడి మొత్తంపై పన్ను ఆదా అవుతుంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను ఆదా చేసుకోండి.

Also Read: Prabhas Health : ప్రభాస్ అంతగా కష్టపడుతున్నాడా?.. అందుకే అనారోగ్యం పాలయ్యాడా?

Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News