Tata Group: మరోసారి అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్.. రెండో స్థానంలో ఇన్ఫోసిస్..

Tata Group: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి టాటా గ్రూప్ నిలిచినట్లు బ్రాండ్ పైనాస్స్ నివేదిక వెల్లడించింది. రెండో స్థానంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, మూడో స్థానంలో ఎల్ఐసీ నిలిచాయి.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2023, 10:48 AM IST
Tata Group: మరోసారి అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్.. రెండో స్థానంలో ఇన్ఫోసిస్..

Tata group is India's most valuable brand: భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 10.3% వృద్ధి చెంది 26.38 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 25 బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించిన ఏకైక భారత బ్రాండ్‌గానూ టాటా గ్రూప్‌ నిలిచినట్లు బ్రాండ్ పైనాస్స్ నివేదిక వెల్లడించింది.  మరోవైపు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

500 సంస్థలతో జాబితాను రూపొందించిన బ్రాండ్ పైనాన్స్ నివేదిక ప్రకారం.. టాటా,  ఇన్ఫోసిస్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా... ఎల్ఐసీ మూడు, ఎయిర్‌టెల్‌ 4వ స్థానంలో, రిలయన్స్ గ్రూప్ 5 స్థానంలో, ఎస్బీఐ ఆరో స్థానంలో, మహీంద్రా గ్రూప్ ఏడో స్థానంలో, విప్రో ఎనిమిదో స్థానంలో,  హెచ్డీఎఫ్సీ తొమ్మిదో స్థానంలోనూ నిలిచాయి. జియో గ్రూప్ 11వ స్థానాన్ని దక్కించుకుంది.

బ్యాంకుల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మహీంద్రా గ్రూప్ టాప్-10లోకి దూసుకొచ్చింది. 17 శాతం వృద్ధిని నమోదు చేసి ఏడో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యంత వేగవంతమైన ఆటోమెుబైల్ బ్రాండ్‌గా మహీంద్రా అండ్‌ మహీంద్రా నిలిచింది. ఇది 53.8 శాతం వృద్ధితో 3.6 బిలియన్ డాలర్లకు తన బ్రాండ్ వ్యాల్యూను పెంచుకుంది. మరోవైపు టాటా మోటార్స్, మారుతీ కూడా రెండంకెల వృద్ధి రేటును నమోదు చేశాయి.

Also Read: Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ వచ్చేసింది.. మహింద్రా థార్ కంటే తక్కువ ధరలో..

మార్కెంటింగ్ కు సంబంధించి తాజ్ దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచింది. దుస్తుల్లో రేమండ్, లోహ కంపెనీల్లో టాటా స్టీల్, హిందాల్కో, వేదాంతా మెరుగైన వృద్ధిని కనబరచాయి. రేమండ్ అయితే భారత్‌లో టాప్‌-100లో స్థానం దక్కించుకుంది. అత్యంత విలువైన విమానయాన బ్రాండ్‌గా ఇండిగో నిలిచింది.

Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News