SIP Investment: ఎస్ఐపీ అనేది ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టలేనివారికి చాలా ప్రయోజనకరం. ఇదొక దీర్ఘకాల పెట్టుబడి ప్లాన్. క్రమబద్ధంగా ఎస్ఐపీలో పెట్టుబడులు పెడుతుంటే దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావచ్చు. అదే విధంగా 21 కోట్ల సంపాదించేందుకు నెలకు ఎంత పెట్టుబడ్ అవసరమో కూడా తెలుసుకుందాం.
ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఇందులో రోజుకు, వారానికి, నెలకు , మూడు నెలలకోసారి లేదా ఏడాదికోసారి పెట్టుబడి పెట్టవచ్చు. ఎక్కువమంది నెలకోసారి పెట్టుబడి పెడుతుంటారు. నెలకు చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్ణీత వ్యవధి తరువాత భారీగా నిధి జమ చేయవచ్చు. సామాన్యులకు సైతం సిప్ అందుబాటులో తీసుకొచ్చేందుకు కనీస పెట్టుబడిని 100 రూపాయలు తగ్గించింది. ప్రతి నెలా మీకు నచ్చిన తేదీకు ఆటో డెబిట్ అవుతుంటుంది. ఇన్వెస్ట్ మెంట్ ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఏ మార్కెట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నామనేది కూడా ముఖ్యం.
నెలకు 18 వేలతో 21 కోట్లు
నెలకు క్రమబద్ధంగా 18 వేలు ఎస్ఐపీ విధానంలో పెట్టుబడి పెడితే 21 కోట్లు సంపాదించవచ్చంటే నమ్మగలరా. కానీ ఇది నిజం ఏడాదికి కనీసం 12 శాతం లెక్కేస్తే 40 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి 21 కోట్లు పొందవచ్చు. అదే పదేళ్లకయితే 41 లక్షల 82 వేలు సంపాదించవచ్చు. 30 ఏళ్లకు 6.33 కోట్లు పొందవచ్చు. ఎంత ఎక్కువకాలం పెట్టుబడి కొనసాగితే అంత ఎక్కువ లాభం ఉంటుంది.
Also read: Railway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, పదో తరగతి పాస్ అయితే చాలు, ఎలా అప్లై చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి