New GST Norms: కస్టరమర్ల నుంచే 5 శాతం జీఎస్​టీ వసూలు చేస్తున్న స్విగ్గీ, జొమాటోలు!

New GST Norms: కేంద్ర ప్రభుత్వం జీఎస్​టీ నిబంధనల్లో సవరణలు చేసింది.  దీనితో స్విగ్గీ, జొమాటోలు కస్టమర్ల నుంచే నేరుగా జీఎస్​టీ వసూలు చేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 04:04 PM IST
  • జనవరి 1 నుంచి మారిన జీఎస్​టీ నిబంధనలు
  • వినియోగదారుల నుంచే జీఎస్​టీ వసూలు చేస్తున్న స్విగ్గీ, జొమాటోలు..
  • పన్ను చెల్లింపు ఎగవతేలను నివారించేందుకేనని ప్రభుత్వం వెల్లడి!
New GST Norms: కస్టరమర్ల నుంచే 5 శాతం జీఎస్​టీ వసూలు చేస్తున్న స్విగ్గీ, జొమాటోలు!

New GST Norms: ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో వంటివి శనివారం (జనవరి 1) నుంచి నేరుగా వినియోగదారుల నుంచి 5 శాతం జీఎస్​టీ (5 pc GST on Swiggy, Zomato Orders) వసూలు చేయడం ప్రారంభించాయి. కేంద్రం ప్రభుత్వం సవరించిన రూల్స్ (New GST rules)​ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

నిబంధనల్లో మార్పు ఎందుకు?

ఇంతకు ముందు ఎవరైనా వినియోగదారులు స్వీగ్గీ, జొమాటో వంటి ఆన్​లైన్ వేదికల ద్వారా ఫుడ్ ఆర్డర్​ చేస్తే.. ఆ అర్డర్​ విలువలతో పాటు, డెలివరీ ఛార్జీలు (కొన్ని సార్లు మినాహాయింపు ఉంటుంది.) మాత్రమే వసూలు చేసేవి. జీఎస్​టీ రిజిస్ట్రేషన్ ఉన్న రెస్టారెంట్లు వినియోగదారుడి నుంచి పన్ను వసూలు చేసేవి.

కొన్ని గుర్తింపు లేని హెటళ్లు, రెస్టారెంట్లు కూడా స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయాలు సాగిస్తూ.. పన్ను చెల్లించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగానే నిబంధనలను సవరించింది. ఈ నిర్ణయంతో జీఎస్​టీ పరిధిలోకి వచ్చే హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

వినియోగదారులపై ప్రభావం ఎంత?

అయితే ఈ నిర్ణయం వల్ల వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదనే చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఇంతకు ముందు వినియోగదారుల నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు జీఎస్​టీ వసూలు చేసేవి.. మారిన నిబంధనలతో ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థలు జీఎస్​టీని వసూలు చేస్తాయి. అయితే వినియోగదారులపై భారం పడకుండా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు గతంలో కేంద్రం వెల్లడించింది. అంటే రెస్టారెంట్లపైనే భారం పడేలా ఈ ప్రక్రియ సాగొచ్చని తెలుస్తోంది.

సెప్టెంబర్​లోనే నిర్ణయం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన సెప్టెంబర్ 17న జరిగిన జీఎస్​టీ మండలి భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. జీఎస్​టీ ఎగవేతలను నివారించేందుకు.. ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్ నుంచే నేరుగా జీఎస్​టీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Also read: Faast E-Scooter: ఒకాయా నుంచి 'ఫాస్ట్​'- ఒక్కసారి ఛార్జ్​తో 200 కిలో మీటర్ల ప్రయాణం!

Also read: Spicejet Offer: కేవలం 1122 రూపాయలకే దేశీయంగా విమాన ప్రయాణం, స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News