Gold Price Today: గుడ్ న్యూస్... బంగారం ధర దిగొచ్చింది.. ఎంత తగ్గిందో తెలుసా..

Gold Price Today August 4th 2022 :  ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4715కి దిగొచ్చింది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5144కి దిగొచ్చింది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 4, 2022, 07:18 AM IST
  • తగ్గిన బంగారం ధరలు
  • 22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.200 మేర తగ్గిన ధర
  • 24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.210 మేర తగ్గిన ధర
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇక్కడ తెలుసుకోండి
 Gold Price Today: గుడ్ న్యూస్... బంగారం ధర దిగొచ్చింది.. ఎంత తగ్గిందో తెలుసా..

Gold Price Today August 4th 2022 : బంగారం ధర దిగొచ్చింది. బుధవారం (ఆగస్టు 4)తో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 మేర ధర తగ్గింది. దిగొచ్చిన ధరలతో ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 నుంచి రూ.47,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 నుంచి రూ.51,440కి చేరింది. హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాలు :

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం (ఆగస్టు 3) రూ.47,350 ఉండగా ఇవాళ (ఆగస్టు 4) అది రూ.47,150కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 నుంచి రూ.51,440కి దిగొచ్చింది.

ఏపీలోని విజయవాడ,విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా ఉంది. 

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతా, కేరళలోని నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,020 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,390గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది.

మహారాష్ట్ర పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,180 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,470గా ఉంది. 

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గడిచిన 10 రోజుల్లో మూడు సార్లు పెరిగిన బంగారం ధర నాలుగుసార్లు దిగొచ్చింది. నెల రోజుల వ్యవధిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 మేర తగ్గింది. బంగారంపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నులు, అలాగే మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్ కారణంగా ఆయా నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ తదితర అంశాల కారణంగా బంగారం ధరలు మారుతుంటాయి. 

Also Read : Big Debate With Bharath: బిగ్ డిబేట్ విత్ భరత్.. సంచలన విషయాలు వెల్లడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Also Read: 

Horoscope Today August 4th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తాము ప్రేమించే వ్యక్తిని కలుసుకునే ఛాన్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News