Purchase Second Hand Maruti Suzuki Baleno Only Rs 4 Lakhs: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో 'మారుతి బాలెనో' ఒకటి. సూపర్ లుక్, మంచి మైలేజ్ కారణంగా బాగా సక్సెస్ అయింది. మారుతి బాలెనో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం ప్రారంభించబడింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు అందించబడ్డాయి. అప్పటి నుంచి ఈ కారు అమ్మకాలు ఇంకా పెరిగాయి. 2023 ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన మూడో కారు బాలెనో. ఈ గణాంకాలను బట్టి ఈ కారుకి ఉన్న ప్రజాదరణను అంచనా వేయవచ్చు. కొత్త కారు వచ్చినా.. పాత మోడళ్ల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. మీరు పాత మోడల్ బాలెనోను కొనుగోలు చేయాలనుకుంటే.. మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో కొనేసుకోవచ్చు.
మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో పాత (సెకండ్ హ్యాండ్) మారుతి బాలెనో కార్లు చాలానే ఉన్నాయి. అమ్మకానికి అందుబాటులో ఉన్న కార్లు ఆల్టో ధర (4 లక్షల నుండి ప్రారంభమవుతుంది)లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వివరాలు చూసుకోవాల్సి ఉంటుంది. ధర, ఇంజిన్ కండిషన్, రీడింగ్, మోడల్ లాంటి వివరాలు చెక్ చేసుకోవాలి.
2015 Maruti Baleno 1.3 ZETA:
మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో 2015 మోడల్ మారుతి బాలెనో 1.3 ZETA వేరియంట్ అమ్మకానికి ఉంది. ఈ కారు 123596 కిలోమీటర్లు ప్రయాణించింది. రెండవ యజమాని వద్ద ఉన్న ఈ కారు ధర రూ.4.25 లక్షలు. ఇది మొరాదాబాద్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇందులో డీజిల్ ఇంజన్ కలదు.
2018 Maruti Baleno 1.2 SIGMA:
2018 మారుతి బాలెనో 1.2 సిగ్మా వేరియంట్ అమ్మకానికి ఉంది. ఈ కారు రీడింగ్ 23859 కిమీలుగా ఉంది. ఇది మొదటి యజమాని వద్ద ఉండగా.. ధర రూ.4.35 లక్షలు. పెట్రోల్ ఇంజన్ గల ఈ కారు కోల్‌కతాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2018 Maruti Baleno 1.3 DELTA:
మారుతి బాలెనో 1.3 DELTA వేరియంట్ 199085 కిమీలు నడిచింది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు 2018 మోడల్ కు చెందినది. మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో ఈ కారు ధర రూ.4.65 లక్షల డిమాండ్ ఉంది. పెట్రోల్ ఇంజన్ ఉన్న ఈ కారు రేవారిలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2016 Maruti Baleno 1.3 ZETA:
మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన మరో కారు మారుతి బాలెనో 1.3 ZETA. ఈ కారు ధర రూ. 4.75 లక్షలు ఉండగా.. ఇది బొకారోలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డీజిల్ ఇంజన్ కారు రీడింగ్ 75723 కిలోమీటర్లుగా ఉంది. 2016 మోడల్ కారు మొదటి యజమాని వద్ద ఉంది.
Also Read: Shubman Gill IPL Record: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!
Also Read: Karnataka CM Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. రేపు ప్రమాణ స్వీకారం! శివకుమార్ మైనస్ అదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.