SBI Sarvottam Scheme Details: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అదిరిపోయే పథకాలను తీసుకువచ్చింది. ఇన్వెస్ట్‌మెట్ కోసం కస్టమర్లను ఆకర్షించడానికి ఎస్‌బీఐ సర్వోత్తం పథకంలో 7.90 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తోంది. అయితే ఇందుకు కొన్ని నింబధనలను అమలు చేస్తోంది.
పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, పోస్ట్ ఆఫీస్ ఇతర సేవింగ్ స్కీమ్స్ కంటే ఈ పథకంలో అధిక వడ్డీని అందిస్తోంది. ఇది కేవలం ఒక సంవత్సరం, 2 సంవత్సరాల పథకం మాత్రమే కావడం విశేషం. అంటే మీరు తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ సర్వోత్తం పథకంలో సాధారణ వినియోగదారులు 2 సంవత్సరాల డిపాజిట్ అంటే ఎఫ్‌డీపై 7.4 శాతం వడ్డీని పొందుతున్నారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్‌పై 7.90 శాతం వడ్డీని పొందుతున్నారు. ఒక సంవత్సంరం పెట్టుబడిపై సాధారణ వినియోగదారులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
సీనియర్ సిటిజన్‌లకు రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్లకు పైబడిన ఒక ఏడాది డిపాజిట్‌పై వార్షిక రాబడి 7.82 శాతం ఉంటుంది. ఇదే డబ్బులకు రెండేళ్ల డిపాజిట్ల రాబడి 8.14 శాతంగా ఉంటుంది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల బల్క్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఒక సంవత్సరానికి 7.77 శాతం, రెండేళ్లకు 7.61 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది. ఈ పథకంలో సమ్మేళనం వడ్డీ లభిస్తుంది. ఉద్యోగ విరమణ చేసి.. పీఎఫ్ డబ్బులు పెద్ద మొత్తంలో విత్ డ్రా చేసుకున్న వారికి ఈ స్కీమ్ చాలా బెటర్ ఆప్షన్ చెప్పొచ్చు. అయితే ఈ స్కీమ్‌లో డబ్బును ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని సమాచారం వెబ్‌సైట్‌లో లేదు.
ఈ సర్వోత్తం పథకంలో ముందుగానే డబ్బును విత్‌డ్రా చేసేందుకు వీలు ఉండదు. నాన్-కాల్ క్యాటగిరీ స్కీమ్‌లు. అంటే మీ డబ్బును మెచ్యురిటీ కంటే ముందు విత్‌డ్రా చేయలేరు. ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాలంటే మీరు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Free Bus Journey: రేపటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ.. ఈ బస్సుల్లోనే అనుమతి.. రూల్స్ ఇవే..!
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి