Investment Tips In Telugu: మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? మీరు ఉద్యోగం చేస్తునే అదనపు ఆదాయం పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్ ఇస్తోంది. మీతో కలిసి వ్యాపారం చేసేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతి నెలా 60 నుంచి 70 వేల రూపాయలు సంపాదించవచ్చు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి కూడా సురక్షితంగా ఉంటుంది. ఎస్‌బీఐ లేదా ఏదైనా ఇతర జాతీయమైన బ్యాంక్ ఎస్‌బీఐ ఏటీఎమ్ ఫ్రాంచైజీని తీసుకోవాలి. ఏటీఎంలను అమర్చడానికి బ్యాంక్‌లు ఓ ప్రత్యేక సంస్థకు అప్పగిస్తాయి. ఆ కంపెనీనే వివిధ ప్రదేశాల్లో ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేస్తుంది.
ఎస్‌బీఐ ఫ్రాంచైజీని తీసుకోవడానికి షరతులు
==> మీకు తప్పనిసరిగా 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
==> ఒక ఏటీఎం నుంచి మరో ఏటీఎంకు మధ్య దూరం కనీసం 100 మీటర్లు ఉండాలి.
==> ఈ స్థలం గ్రౌండ్ ఫ్లోర్‌లో మంచి విజిబిలిటీ ఉన్న ప్రదేశంగా ఉండాలి.
==> ఇక్కడ 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలి. ఇది కాకుండా, 1 KW విద్యుత్ కనెక్షన్ కూడా అవసరం.
==> ఈ ఏటీఎం రోజుకు దాదాపు 300 లావాదేవీల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
==> ఏటీఎం పెట్టే ప్లేస్‌లో కాంక్రీట్ పైకప్పు ఉండాలి.
==> V-SAT ఇన్‌స్టాలేషన్ కోసం సంఘం లేదా అధికారం నుంచి ఎటువంటి అభ్యంతర ధృవీకరణ పత్రం అవసరం లేదు.
ఏటీఎం ఫ్రాంచైజీకి అవసరమైన పత్రాలు
==> ఐడీ ప్రూఫ్-ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్
==> అడ్రస్ ప్రూఫ్-రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్లు
==> బ్యాంక్ ఖాతా, పాస్‌బుక్
==> ఫోటోగ్రాఫ్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్
==> జీఎస్‌టీ నంబర్
==> ఆర్థిక పత్రాలు
ఎంత సంపాదిస్తారు..?
టాటా ఇండిక్యాష్ ఏటీఎంలను మీరు చూసే ఉంటారు. ఈ కంపెనీ ఫ్రాంచైజీకి 2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌పై ఇస్తుంది. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తుంది. ఇది కాకుండా.. మీరు వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ విధంగా మీరు 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీరు ప్రతి నగదు లావాదేవీపై రూ.8, నగదు రహిత లావాదేవీపై రూ.2 పొందుతారు. మీ ఏటీఎం నుంచి ప్రతిరోజూ 250 లావాదేవీలు జరిగితే.. మీరు నెలకు రూ.60,000 వరకు సంపాదించవచ్చు.
ఎలా తీసుకోవాలి..?
ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ కోసం కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటీఎంలను ఇన్‌స్టాల్ చేసే కంపెనీలు భిన్నంగా ఉంటాయి. ఈ ఒప్పందాలు చాలా వరకు ఇండిక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎంతో ఉన్నాయి. www.indicash.co.in, www.muthootatm.com/suggest-atm.htm l, india1atm.in/rent-your-space వెబ్‌సైట్‌లను సందర్శించండి.
Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి