ATM Franchise Business: ఏటీఎం ఫ్రాంచైజ్‌తో నెలకు 60 వేలు సంపాదన, ఎలాగంటే

ATM Franchise Business: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నెలకు 60 వేలు ఆర్జించే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. దీనికోసం కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2023, 07:51 AM IST
ATM Franchise Business: ఏటీఎం ఫ్రాంచైజ్‌తో నెలకు 60 వేలు సంపాదన, ఎలాగంటే

ATM Franchise Business: ఇది ఎస్పీఐతో వ్యాపారం కలిగి ఉండే అవకాశం. ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజ్ బిజినెస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఏటీఎం ఫ్రాంచైజీకు తీసుకోవడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

ఇంట్లో కూర్చుని ఆదనపు ఆదాయం కోసం ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. ఇంట్లో కూర్చుని నెలకు 60 వేల రూపాయలు సంపాదించవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజ్ ద్వారా ఈ అవకాశం కలగనుంది. కంపెనీలు ఇన్‌స్టాల్ చేసే ఏటీఎంలు వేరుగా ఉంటాయి. బ్యాంకులు ఎప్పుడూ నేరుగా ఏటీఎంలు ఇన్‌స్టాల్ చేయవు. బ్యాంకుల తరపున కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలు ఈ పని చేస్తుంటాయి. విభిన్న ప్రదేశాల్లో ఏటీఎంలు ఇన్‌స్టాల్ చేస్తుంటాయి.

ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజి పొందాలంటే ఏం కావాలి

50-80 చదరపు అడుగుల స్పేస్ అవసరం
మరో ఏటీఎం నుంచి కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి
గ్రౌండ్ ఫ్లోర్ అయుండి..అందరికీ కన్పించేట్టు ఉండాలి
24 గంటలు విద్యుత్ సరఫరాతో పాటు 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి
ఏటీఎం లావాదేవీలు రోజుకు 300 ఉండేట్టుండాలి
ఏటీఎం స్పేస్ కాంక్రీట్ రూఫ్ కలిగి ఉండాలి
వి శాట్ ఇన్‌స్టాల్ చేసేందుకు వీలుగా సొసైటీ లేదా అధారిటీ నుంచి నో అబ్జక్షన్ సర్ఠిఫికేట్ ఉండాలి

కావల్సిన డాక్యుమెంట్లు

ఐడీ ప్రూఫ్-ఆధార్ కార్డు, పాన్‌కార్డు, వోటర్ కార్డు
అడ్రస్ ప్రూఫ్-రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్
బ్యాంక్ ఎక్కౌంట్ , పాస్‌బుక్
ఫోటోగ్రాఫ్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్
జీఎస్టీ నెంబర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు

ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజ్‌కు ఎలా అప్లై చేయాలి

ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజిని కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. టాటా ఇండికాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం కంపెనీలు దేశంలో ఏటీఎంలు ఇన్‌స్టాల్ చేసేందుకు కాంట్రాక్ట్ కలిగి ఉన్నాయి. టాటా ఇండికాష్ కోసం www.indicash.co.in,ముత్తూట్ ఏటీఎం కోసం www.muthootatm.com/suggest-atm.html,ఇండియా వన్ ఏటీఎం కోసం india1atm.in/rent-your-space వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఎంత పెట్టుబడి అవసరం

టాటా ఇండికాష్ అనేది అన్నింటిలో అతిపెద్దది. 2 లక్షల రూపాయలు రిఫండెబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉటుంది. ఇది కాకుండా వర్కింగ్ కేపిటల్ కింద 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం పెట్టుబడి 5 లక్షల రూపాయలు. 

ఎంత ఆదాయం వస్తుంది

ప్రతి నగదు లావాదేవీపై 8 రూపాయలు, నగదు రహితమైతే 2 రూపాయలు లభిస్తాయి. మీ పెట్టుబడిపై రిటర్న్స్ అనేది వార్షికంగా 33-50 శాతం ఉంటుంది. అంటే రోజుకు మీ ఏటీఎం ద్వారా 250 లావాదేవీలు జరిగితే అందులో 65 శాతం నగదు లావాదేవీలు, 35 శాతం నగదు రహిత లావాదేవీలుంటే నెలకు ఆదాయం 45 వేల రూపాయలుంటుంది. అదే రోజుకు లావాదేవీలు 500 ఉంటే నెలకు 88-90 వేల రూపాయలు కమీషన్ వస్తుంది. 

Also read: CBSE Board Exams 2024: సీబీఎస్ఈ 10, 12 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల, జనవరి 1 నుంచి ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News