Stock Market IPO: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ప్రైమరీ మార్కెట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మంచి లాటరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే లిస్టింగ్ రోజే వీరికి భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి హోంవర్క్ చేసుకొని సరైన స్ట్రాటజీ తో ఐపిఓ దాఖలు చేసుకున్నట్లయితే లిస్టింగ్ రోజు మీకు మీ పెట్టుబడి పై 100% రాబడి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇటీవల లిస్ట్ అయినటువంటి ఐపిఓల్లో S A Tech Software India IPO ఏకంగా 100% రాబడి ఇచ్చి ఇన్వెస్టర్లలో ఆనందాన్ని నింపింది.ఇప్పుడు తాజాగా ఓలా ఐపీఓ మీద కూడా అందరి దృష్టి నెలకొని ఉంది.
సోమవారం రోజు దేశీయ సూచీల్లో పతనం చూసినప్పటికీ, మంగళవారం మాత్రం పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సాథ్లోఖర్ సినర్జీస్ ఈ అండ్ సీ గ్లోబల్ లిమిటెడ్ (Sathlokhar Synergys) తన పెట్టుబడి దారులకు మంచి లాభాలను అందిస్తోంది. ఈరోజు ఎస్ఎంఈ ఎక్స్చేంజీలో ఏకంగా 85.7శాతం ప్రీమియంతో ఈ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర కేవలం రూ. 140 గానే ఉండగా, ఈ షేర్లు బీఎస్ ఎస్ఎంఈ సూచీలో రూ. 260 దగ్గర లిస్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ షేరు విలువ రూ. 247కు చేరుకుంది.
జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు సబ్ స్క్రిప్షన్ జరిగింది. ఇష్యూ ముగిసిన 4 రోజులకు షేర్ల లిస్టింగ్ జరిగింది. ఇది ఒక్కో లాట్ కింద కనీసం వెయ్యి షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే ఇష్యూ ధర అప్పర్ ప్రైజ్ బ్యాండ్ లిమిట్ రూ. 149తో చూస్తే మొత్తం పెట్టుబడి కనీసం రూ. 1.40 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇక లిస్టింగ్ ధరతో చూస్తే షేర్ల ధర రూ. 2.60 లక్షలుగా మారింది. ఒక్కో లాట్ పై రూ. 1.20 లక్షల వరకు లాభం వచ్చింది. ప్రస్తుత ధరతో పోల్చినట్లయితే లక్షా 4వేల పెట్టుబడిపై రూ. 2.47లక్షల వరకు లాభం వచ్చింది.
కాగా ఇతర ఐపీఓల మాదిరిగానే ఈ ఐపీఓకు ఫుల్ డిమాండ్ కనిపించింది. మొత్తం ఐపీఓ కింద సంస్థ 42.28లక్షల షేర్లను ఆఫర్ చేస్తే..ఏకంగా 89.26కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు అయ్యాయి. అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి 211.13 రెట్ల మేర స్పందన వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సంస్థ 66.38 లక్షల షేర్లు ఇష్యూ చేసింది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, ఇన్ ఫ్రా టర్న్ కీ కన్ స్ట్రక్షన్ కంపెనీగా పేరుంది.
Also Read: Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter