Beer Prices may hike: రష్యా-ఉక్రెయిన్ వివాదంతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర ఏడేళ్ల గరిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. మున్ముందు చమురు ధర 100 డాలర్లకు పైనే పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు, అనిశ్చితి కారణంగా రాబోయే వేసవిలో బీర్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ సప్లై చైన్‌పై భారీ ప్రభావం పడితే బీర్ సప్లైలోనూ కొరత ఏర్పడవచ్చునని చెబుతున్నారు.
బీర్ తయారీలో ఉపయోగించే బార్లీ ఉత్పత్తిలో ప్రస్తుతం రష్యా ప్రపంచంలోనే టాప్-2 స్థానంలో ఉంది. ఉక్రెయిన్ టాప్-4 స్థానంలో ఉంది. ఇప్పుడీ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో బార్లీ సప్లైపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. అదే జరిగితే బార్లీ ధరలు అమాంతం పెరిగి.. బీర్ ధరలు కూడా పెరుగుతాయి.
నిజానికి.. కొన్ని ప్రీమియం బ్రాండ్లను మినహాయిస్తే.. ఇండియన్ బ్రూవరీస్ చాలావరకు స్థానికంగానే బార్లీని సేకరిస్తుంటాయి. అయితే అంతర్జాతీయంగా బార్లీ సప్లై చైన్‌కి ఆటంకం ఏర్పడి ధరలు పెరిగితే.. దేశీ మార్కెట్‌పై కూడా దాని ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బార్లీ ధరలకు అనుగుణంగా ఇక్కడ కూడా బార్లీ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అదే జరిగితే బీర్ ధరలు పెరగక తప్పదు.
బ్రూవరీ మార్కెట్ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం... భారత్‌లోని బ్రూవరీ మార్కెట్‌లో 40 శాతం కన్నా ఎక్కువ వాటా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ కలిగింది. ఈ కంపెనీ ఫిబ్రవరి-మార్చి నెలల్లో బార్లీని సేకరిస్తుంది. సాధారణంగా సమ్మర్‌లో బీర్ సప్లైకి ఉండే డిమాండ్ తెలిసిందే. ఒకవేళ బార్లీ సప్లైకి గనుక ఆటంకం ఏర్పడితే భారత్‌లోని బ్రూవరీ మార్కెట్‌పై కూడా అది ప్రభావం చూపిస్తుంది. బీర్ తయారీలో ముడి సరుకుగా ఉన్న బార్లీ ధరలు పెరిగితే బీర్ ధరలు కూడా ఆటోమేటిగ్గా పెరుగుతాయి.
గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా వివిధ దేశాలు వేసవిలో లాక్‌డౌన్‌లో ఉన్న కారణంగా బీర్ కంపెనీలకు నష్టాలు వాటిల్లక తప్పలేదు. ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈసారి సమ్మర్‌లో బీర్ సేల్స్ జోరుగా జరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కానీ ఇంతలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు బార్లీ సప్లై చైన్‌కి ఆటంకం కలిగించే పరిస్థితులకు దారితీస్తుండటంతో బీర్ ధరలు కూడా పెరగవచ్చునని చెబుతున్నారు. అదే జరిగితే బీర్ కొనుగోళ్లపై కూడా ప్రభావం పడవచ్చు.
Also Read: Ramya Raghupati Case: ఆ భయంతో 3 నెలల క్రితమే పబ్లిక్ నోటీస్.. మాజీ భార్య కేసుపై నరేష్ రియాక్షన్
Samantha: లవ్ యూ నల్గొండ.. నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది: సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook