M3M Hurun Global Rich list 2023: ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ముకేష్ అంబానీ

M3M Hurun Global Rich list 2023: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ టాప్ 10 ప్రపంచ కుబేరుల్లో మరోసారి స్థానం సంపాదించుకున్నారు. ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023లో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయుడు కావడం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2023, 11:12 AM IST
M3M Hurun Global Rich list 2023: ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ముకేష్ అంబానీ

M3M Hurun Global Rich list 2023: దేశీయ కుబేరుడిగా  మకేష్ అంబానీ మరోసారి  చోటు దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ఎం3ఎం హురూన్ జాబితాలో ఓ భారతీయుడికి చోటు దక్కడం ఇదే తొలిసారి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ముకేష్ అంబానీ ఎం3ఎం హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023లో టాప్ 10 లో చోటు దక్కించుకుని రికార్డు సాధించారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయుడు అంబానీనే. బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొన్నటి వరకూ 3వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పుడు 23వ స్థానానికి పడిపోయారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ 8,100 కోట్ల డాలర్లతో టాప్ 10లో 9వ స్థానంలో నిలిచారు. ముకేష్ అంబానీ నికర సంపాదనను 82 బిలియన్ డాలర్లుగా హురూన్ జాబితా పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపాదన 20 శాతం తగ్గింది. అయితే హిండెన్‌బర్గ్ దెబ్బతో అదానీ సంపద విలువ పతనం కావడంతో..కుబేరుల జాబితాలో అంబానీ మరోసారి చేరారు.

హిండెన్‌బర్గ్ నివేదిక కంటే ముందు అదానీ సంపద దృష్ట్యా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నారు. రిపోర్ట్‌కు ముందు 150 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత 53 డాలర్లకు పడిపోయింది. ఈ నివేదిక కారణంగా గ్రూప్  ఆదాయంతో పాటు అదానీ వ్యక్తిగత ఆదాయం కూడా పడిపోయింది. 2022-23లో వారానికి 3 వేల కోట్ల ఆదాయాన్ని అదానీ నష్టపోయినట్టుగా హురూన్ నివేదిక తెలిపింది. 

మరోవైపు ఏడాది వ్యవధిలో అత్యధికంగా సంపద కోల్పోయిన వ్యక్తుల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రధమ స్థానంలో ఉన్నారు. ఏడాది కాలంలో ఏకంగా 70 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయారు. ప్రపంచ కుబేరుల జాబితా టాప్ 10లో అదానీ స్థానం కోల్పోయినా..ముకేష్ అంబానీ ఆ స్థానాన్ని భర్తీ చేయడం విశేషం.

Also read: Hindenburg Report: హిండెన్‌బర్గ్ హిట్ లిస్టులో మరో పెద్ద కంపెనీ, త్వరలో నివేదిక, భారతీయ కంపెనీల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News