Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో అంటే రిటైర్మెంట్ తరువాత ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం అనేది చాలా అవసరం. తద్వారా వారి కనీస ఖర్చులు తీర్చుకోవచ్చు. దీనికోసం పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్లకు ఇది అద్భుతమైన పధకం. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 20 వేల 500 రూపాయలు ఐదేళ్లపాటు పొందవచ్చు.
పోస్టాఫీసు అందించే ఈ పధకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో గరిష్టంగా నెలకు 20,500 రూపాయలు అందుతాయి. అది కూడా ఐదేళ్ల వరకూ తీసుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 1000 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైర్మెంట్ తరువాత ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం కోసం చూసేవారికి బెస్ట్ ఇది. ఇందులో పెట్టుబడి పెడితే నెలకు లేదా మూడు నెలలకు వడ్డీ రూపంలో మంచి ఆదాయం ఉంటుంది. ఈ పథకం 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది. వీఆర్ఎస్ తీసుకున్నవారికైతే 55-60 ఏళ్లు మద్యలో కూడా ఉండవచ్చు. డిఫెన్స్ సర్వీసుల్లో చేసిన రిటైర్ అయినవారు 50 ఏళ్లకే ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో మీరు, మీ భార్య ఇద్దరూ కలిసి జాయింట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు కనీసం 1000 రూపాయలు గరిష్టంగా 30 లక్షల రూపాయలు ఉండవచ్చు. 1000 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్లవచ్చు. గరిష్టంగా 30 లక్షల వరకు మాత్రమే పరిమితి ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌పై వడ్డీ 8.2 శాతం చెల్లిస్తోంది. ఇతర సేవింగ్స్ స్కీమ్స్ కంటే ఇది చాలా ఎక్కువ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి వడ్డీ ఒక్కటే 2.46 లక్షలు ఉంటుంది. అంటే నెలకు 20,500 రూపాయలు. రిటైర్మెంట్ తరువాత ఆదాయం కోసం ఇది అద్బుతమైన అవకాశం. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది జీరో రిస్క్‌తో అద్భుతమైన రిటర్న్స్ అందించే మంచి పధకం. ఎందుకంటే దీనిపై వడ్డీ ఎక్కువ లభిస్తుంది. పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook